Fauji Movie : టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య వరుసగా సినిమాల చేస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్. నిజానికి ఈయన చేతిలో ఎప్పుడూ అరడజనుకు పైగా సినిమాలు ఉంటాయి.. కానీ కేవలం ఏడాదికి ఒక్క సినిమాతో మాత్రమే ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అయితే ఈ ఏడాది మాత్రం డార్లింగ్ నుంచి రెండు సినిమాలు ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితిని చూస్తుంటే ఈ ఏడాది కూడా ఒక్క సినిమానే అనిపిస్తుంది.. నిజానికి ఈ ఏడాది దసరా కానుకగా పౌజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి… అయితే ఆ మూవీ ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.. అందుకు కారణం ప్రభాస్ అని వార్తలు ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది.. అసలు ఎందుకు ఈ మూవీ ఆలస్యం అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..
పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్నా మూవీ ఫౌజీ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.. ఇప్పటివరకు ఈ మూవీ 80 శాతం షూటింగ్ని పూర్తి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మూడు కీలక యాక్షన్ సీన్స్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మిగిలి ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. ఓ అప్డేట్ కూడా వచ్చేసింది. దాంతో ఫ్యాన్స్ ఎలాంటి సాంగ్ రాబోతుందో అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ పోస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మరో వార్త చక్కర్లు కొడుతుంది. షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో పాటు, భారీ స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టొచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలు పై చిత్ర యూనిట్ స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి ఈ సినిమా ఈ ఏడాదిలో వస్తుందా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతుందా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది…
ఈ మూవీ స్టోరీ 1940ల కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది. బ్రిటిష్ పాలన సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంగా సైనికుడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటి పరిస్థితులలో ఆ సైనికుడు ఎలా ధైర్యంగా నిలబడ్డాడు అన్నది ఈ సినిమా స్టోరీ. ప్రభాస్ ఓ ధైర్యవంతుడైన సైనికుడిగా కనిపించనుండగా, ఆయన పాత్రలోని ఎమోషన్స్ హైలెట్ గా నిలుస్తాయని టాక్.. ఇక ఇందులో సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఇస్మాయిల్ టాలీవుడ్ కు పరిచయం అవుతుండగా, సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు.. దాదాపుగా 400 కోట్లకు పై బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.. సాధారణంగా ప్రభాస్ సినిమాలు అంటే అంచనాలు వేరేలా ఉంటాయి. మరి ఈ సినిమా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ని ఏమాత్రం రీచ్ అవుతుందో చూడాలి..