E-Paper
Advertisement

మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. బూడిదైన ‘ఫర్నిచర్ హోమ్స్’ షోరూమ్!

మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. బూడిదైన ‘ఫర్నిచర్ హోమ్స్’ షోరూమ్!
Advertisement

Miyapur Fire: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కల్వరి టెంపుల్ సమీపంలోని ‘ఫర్నిచర్ హోమ్స్’ అనే షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో దాదాపు 70 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదైనట్లు అంచనా వేస్తున్నారు.

అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో మొదట ఎవరూ గమనించలేకపోయారు. షాప్ లోపల షార్ట్ సర్క్యూట్ ఏర్పడటం వల్ల మంటలు మొదలైనట్లు తెలుస్తోంది. ఫర్నిచర్ అంతా కలప, కుషన్లు వంటి త్వరగా మంటలు అంటుకునే వస్తువులు కావడంతో, నిమిషాల వ్యవధిలోనే మంటలు షోరూమ్ మొత్తం వ్యాపించాయి. మంటల తీవ్రత ఎంతలా ఉందంటే.. షోరూమ్‌కు ఆనుకుని ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఏసీ అవుట్ డోర్ యూనిట్లు కూడా వేడికి కాలిపోయాయి.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ తెల్లవారుజామున కావడంతో ప్రాణనష్టం తప్పింది, కానీ షోరూమ్ యజమాని మాత్రం కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని చవిచూశారు. స్థానిక మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పక్కనే అపార్ట్‌మెంట్లు ఉండటంతో స్థానికులు కొంతసేపు భయాందోళనకు గురయ్యారు.

Also Read: ఏలూరులో విషాదం.. నకిలీ వైద్యుడి ఓవర్ డోస్ మందులకు 8 ఏళ్ల చిన్నారి మృతి

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×