E-Paper
Advertisement

ఘనంగా ‘M4M’ ప్రీ రిలీజ్ ఈవెంట్… డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల బంపర్ ఆఫర్

ఘనంగా ‘M4M’ ప్రీ రిలీజ్ ఈవెంట్… డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల బంపర్ ఆఫర్
Advertisement

M4M Pre Release event : మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder). ఈ సినిమాలో అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించారు. మే 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు.

అమెరికా అమ్మాయితో ప్రయోగం

Advertisement

ఈ వేడుకకు తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు విఎన్ ఆదిత్య, సీనియర్ వి సముద్ర హాజరయ్యారు. దాసరి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకొని దర్శకుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ వేడుక జరగడం అన్నది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. విఎన్ ఆదిత్య వేడుకలో మాట్లాడుతూ దర్శకుడు మోహన్ వడ్లపట్ల టాలెంట్ ను ప్రశంసించారు. అలాగే జో శర్మకు మంచి భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. డైరెక్టర్ వి సముద్ర ఈ వేడుకలో మాట్లాడుతూ… మూవీ బిగ్ హిట్ కావాలని ఆకాంక్షించారు. ఇక కొత్త హీరోయిన్ జో శర్మ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మోహన్ వడ్లపట్లకు వేడుక సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఈ మూవీకి 15 పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించిన ఆవిడ ప్రేక్షకులు మూవీని హిట్ చేయాలని కోరుకున్నారు.

ఆడియన్స్ కు ఆఫర్

Advertisement

డైరెక్టర్ నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ఆడియన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించారు. సినిమాలో సీరియల్ కిల్లర్ ఎవరో చెప్తే వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించినట్టు వెల్లడించారు. ఈ మూవీ ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అని, క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను ఊహించని మలుపులతో థ్రిల్ చేస్తుందని ఆయన అన్నారు. అలాగే ఈ మూవీ ద్వారా ఆడియన్స్ కు ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read : జైలుకెళ్లి మరీ కిల్లర్లతో ఇంటర్వ్యూలు… సైకోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూపించే గూస్‌బంప్స్ సిరీస్

వినూత్న ప్రయోగంతో తెరకక్కుతున్న ఈ మూవీకి అంతే కొత్తగా ప్రమోషన్లు కూడా చేస్తున్నారు నిర్మాతలు. కిల్లర్ ను కనిపెట్టిన ప్రేక్షకులలో ఒకరికి ఏకంగా లక్ష బహుమతిని ప్రకటించడం అన్నది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఈ సినిమాకు హీరోయిన్ జో శర్మ ప్రధాన బలమని నటుడు ఎంఆర్సి వడ్లపట్ల అన్నారు. సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మే 8న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ దక్కనుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×