E-Paper
Advertisement

Prabhas : జియోహాట్ స్టార్ కు బిర్యానీ ఆర్డర్లు… ప్రభాస్ ఫ్యాన్స్ అనిపించుకున్నారు కదరా బాబు!

Prabhas : జియోహాట్ స్టార్ కు బిర్యానీ ఆర్డర్లు… ప్రభాస్ ఫ్యాన్స్ అనిపించుకున్నారు కదరా బాబు!
Advertisement

Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఈయన నటించిన ది రాజా సాబ్ (The Rajasaab)సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ విడుదల అయినప్పటికీ పెద్దగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా థియేటర్లో మెప్పించలేక పోయిన ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో ప్రసారమవుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడంతో ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

అంతా లవ్వే డార్లింగ్స్…

ఇకపోతే కొంతమంది ప్రభాస్ అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా ఉత్సాహం కనబరుస్తున్న సంగతి తెలిసిందే .తాజాగా కొంతమంది అభిమానులు జియో హాట్ స్టార్ కు పెద్ద ఎత్తున బిర్యాని పార్సల్స్ ఆర్డర్ చేయడం విశేషం. ఇలా బిర్యానీ ఆర్డర్స్ కి సంబంధించిన ఫోటోని జియో హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. “లవ్వే లవ్వే ..అంతా లవ్వే .. థాంక్యూ డార్లింగ్ ఎవరైనా కొట్టి చంపేస్తారు మీరు మాత్రం పెట్టి చంపేస్తున్నారు అంటూ బిర్యాని ఆర్డర్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ ఫుడ్ లవర్..

Advertisement

ప్రభాస్ ఫుడ్ లవర్ అనే విషయం మనకు తెలిసిందే .ఈయన ఎవరికైనా ఫుడ్ పంపించారు అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఇదివరకు ఎంతో మంది సెలబ్రిటీలు తెలియజేశారు. ప్రభాస్ ప్రేమతో కాదు ఫుడ్ తో చంపేస్తారంటూ ఎంతో మంది సెలబ్రిటీలు ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పారు. ఇలా ప్రభాస్ అభిమానులు కూడా ఆయనకు ఏమాత్రం తీసిపోకుండా పెద్ద ఎత్తున ఫుడ్ ఆర్డర్లు చేయడంతో ఇది తెలిసిన నెటిజన్స్ ప్రభాస్ అభిమానులు అనిపించుకున్నారు కదరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే గతంలో రాజా సాబ్ డైరెక్టర్ మారుతి ఇంటికి కూడా ఇలాగే ప్రభాస్ అభిమానులు బిర్యాని ఆర్డర్లు పెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ మంచి అంచనాలు పెంచేయడంతో ప్రభాస్ అభిమానులు ఫీదా అవుతూ డైరెక్టర్ మారుతికి బిర్యానీ ఆర్డర్లు పంపించారు .అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవడం కోసం దాదాపు స్విగ్గి జొమాటో నుంచి 100 ఆర్డర్లు క్యాష్ అండ్ డెలివరీ పెట్టి డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమా హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో అభిమానులు హాట్ స్టార్ కు కూడా బిర్యానీ ఆర్డర్ పెట్టడంతో సంచలనంగా మారింది.

Also Read: Jananayagan Release:  జననాయగన్ రాకకు అంతా సిద్ధం.. విడుదల ఎప్పుడంటే?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×