E-Paper
Advertisement

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల అప్‌డేట్.. మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికకు గైడ్‌లైన్స్ విడుదల!

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల అప్‌డేట్.. మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికకు గైడ్‌లైన్స్ విడుదల!
Advertisement

Telangana Municipal Elections 2026: తెలంగాణ రాష్ట్రంలో 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల కౌంటింగ్ 13వ తేదీన ముగియనుండగా, కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అంటే 16వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ల ఎంపిక జరగనుంది. ఈ తక్కువ సమయంలోనే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ పట్టు నిలుపుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ పరోక్ష ఎన్నికల (Indirect Elections) కోసం అవసరమైన ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీడీఎంఏ (CDMA) తో పాటు జిల్లా కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. స్పెషల్ మీటింగ్ నిర్వహణకు ముందే ఎన్నికకు అవసరమైన అన్ని పత్రాలను మున్సిపల్ కమిషనర్ల దగ్గర సిద్ధం చేసుకోవాలని సూచించింది.

Advertisement

ముఖ్యంగా స్పెషల్ మీటింగ్ సమయంలో రిజర్వేషన్ పత్రాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, పోలీసు బందోబస్తు వంటి అంశాలపై ఎన్నికల కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సభకు హాజరయ్యే వారిపై నిశిత నిఘా ఉంచాలని, సిట్టింగ్ అరేంజ్మెంట్లను పక్కాగా పర్యవేక్షించాలని అధికారులను కోరారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

Read Also: Chamala Kiran: రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ఏం చేశారు..? కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×