E-Paper
Advertisement

Prabhas New Movie : ప్రేమ్ రక్షిత్‌తో ప్రభాస్ మూవీలో బిగ్ ట్విస్ట్… కనిపించడు.. జస్ట్ వినిపిస్తాడు అంతే

Prabhas New Movie : ప్రేమ్ రక్షిత్‌తో ప్రభాస్ మూవీలో బిగ్ ట్విస్ట్… కనిపించడు.. జస్ట్ వినిపిస్తాడు అంతే
Advertisement

Prabhas Movie With Choreographer Prem Rakshit: స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. దశాబ్ధాలుగా స్టార్ హీరోలకు కొరియోగ్రాఫి అందిస్తున్న ఆయన ఓ యానిమేటెడ్ చిత్రంతో తొలిసారిగా డైరెక్టర్ గా మారనున్నారు. అయితే ఇందులో ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ ప్రభాస్ కాంబోలో ఓ మూవీ సెట్ అయినట్టు సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరగుతుంది

ప్రభాస్ తో యానిమేషన్ చిత్రం

Advertisement

ఇది ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ మూవీ అని, ఈ సినిమా ద్వారాప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ప్రేమ్ రక్షిత్ బయటకు తీయబోతున్నాడంటూ ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇది యానిమినేట్ చిత్రమేనట. ఇందులో ప్రభాస్ ది ఫుల్ లెన్త్ రోల్ కాదని సమాచారంతో. ఓ కీలక పాత్రలో మాత్రమే కనిపిస్తాడట. అది యానిమేషన్ రూపంలో మాత్రమే కనిపిస్తాడటఈ పాత్రకు ప్రభాస్ కేవలం వాయిస్ మాత్రమే అందిస్తాడట. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ కూడా కాలేదట ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఛత్రపతితో ఇండస్ట్రీ ఎంట్రీ

అంత ఒకే అయ్యి ఇది రూపుదిద్దుకోవానికి ఇంకా కొంత సమయంలో పడుతుందని అంటున్నారు. కాబట్టి ఇప్పట్లో ఈ సినిమా వచ్చే అవకాలు లేవని టాక్. కాగా దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి మూవీతోనే ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీతో రాజమౌళి, ప్రభాస్ లు విపరీతైమన స్టార్ డమ్ అందుకున్నారు. ఛత్రపతి మూవీ యూనిట్ మొత్తానికి కూడా ఎనలేదని గుర్తింపు వచ్చింది. ఇందులో పాటలు కూడా సూపర్ డూపర్ హిట్. ఇక ప్రభాస్ స్టేప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కొరియోగ్రఫర్ డెబ్యూ మూవీతోనే ప్రేమ్ రక్షిత్ సక్సెస్ అయ్యాడు. ఛత్రపతి తర్వాత ఎన్నో పెద్ద సినిమాలకు పని చేశాడు.

Advertisement

Also Read: Nag Ashiwn: ఆ దిగ్గజ దర్శకుడి రీఎంట్రీ.. నిర్మాతగా నాగ్ అశ్విన్

వారి బాటలోనే ప్రేమ్ రక్షిత్.. సక్సెస్ అయ్యేనా

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకు ఎన్నో సినిమాల్లో కొరియోగ్రాఫి చేశాడు.కాగా ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలామంది కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు. అందులో ముందుగా వినిపంచే పేరు రాఘవ లారెన్స్, ప్రభుదేవా. ప్రభుదేవా తొలిసారి దర్శకత్వం వహించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా ఎంతపెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత పౌర్ణమి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ, డీసెంట్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన స్టైల్, మాస్, డాన్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. వీళ్లు కూడా మొదటి కొరియోగ్రాఫర్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినవాళ్లే. ఇక ప్రేమ్ రక్షిత్ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×