E-Paper
Advertisement

Shubman Gill: టీమిండియాకు బిగ్ షాక్.. గిల్ రిటైర్డ్ హర్ట్, 4 వికెట్లు డౌన్

Shubman Gill: టీమిండియాకు బిగ్ షాక్.. గిల్ రిటైర్డ్ హర్ట్, 4 వికెట్లు డౌన్
Advertisement

Shubman Gill: కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న తొలి టెస్ట్ లో మొదటిరోజు భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా కి ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. తొలిరోజు లంచ్ బ్రేక్ వరకు వికెట్లు పడినప్పటికీ పోరాడిన సౌత్ ఆఫ్రికా.. లంచ్ బ్రేక్ అనంతరం రెండవ సెషన్ లో ఒక్కసారిగా కుప్పకూలింది. బుమ్రా, కుల్దీప్ తో పాటు మహమ్మద్ సిరాజ్ రాణించడంతో.. సఫారీలు 159 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు. బుమ్రా {5/27} తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించాడు.

Also Read: Shubman Gill father: సారాతో పెళ్లి రూమ‌ర్స్‌.. గిల్ తండ్రి అదిరిపోయే ఆన్స‌ర్‌, వీడియో వైర‌ల్‌

భారత్ తొలి ఇన్నింగ్స్:

Advertisement

తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు కూడా ఆదిలోనే షాక్ తగిలింది. భారత ఓపెనర్ యశస్వి జైష్వాల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి మార్కో యన్సెన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ తో కలిసి కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ఇక రెండవ రోజు కేఎల్ రాహుల్ {13}, వాషింగ్టన్ సుందర్ {6} పరుగులతో ఆట ప్రారంభించారు. కానీ రెండవ రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో మార్క్రమ్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత వాషింగ్టన్ సుందర్ {29} పరుగులు చేసి హర్మర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

గిల్ రిటైర్డ్ హర్ట్:

ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన భారత కెప్టెన్ గిల్.. రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మెడ పట్టేయడంతో అతడు మైదానం వీడాల్సి వచ్చింది. రెండవ రోజు ఉదయం తొలి సెషన్ లో ఈ ఘటన జరిగింది. రెండవ వికెట్ రూపంలో వాషింగ్టన్ సుందర్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ గిల్.. కేవలం 3 బంతులు మాత్రమే ఆడాడు. ఆ సమయంలో హార్మర్ బౌలింగ్ లో స్వీప్ షాట్ తో బౌండరీ కొట్టిన గిల్.. ఇక బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఒక్కసారిగా మెడ పట్టేయడంతో అతడు తన తలను తిప్ప లేకపోయాడు. ఈ క్రమంలో రిటైర్డ్ హార్ట్ అయ్యాడు.

Advertisement

Also Read: KKR: అన్ని జట్లు తోపు ప్లేయర్లను కొనుగోలు చేస్తే, KKR మాత్రం కోచ్ లను తెచ్చుకుంటుంది.. వీళ్ళు ఏంటో, వీళ్ళ కట్టుబాట్లు ఏంటో

అనంతరం రిషబ్ పంత్ బ్యాటింగ్ కి దిగాడు. ఇక క్రీజ్ లోకి దిగిన రిషబ్ పంత్ తనదైన దూకుడుతో కేవలం 24 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్స్ లు కూడా ఉన్నాయి. 27 పరుగులు చేసి మంచి టచ్ లోకి వచ్చినట్లు కనిపించిన పంత్ ని.. బాష్ బోల్తా కొట్టించాడు. ఇక భారత్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో రవీంద్ర జడేజా {11}, దృవ్ జురెల్ {5} ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు మరో 21 పరుగుల వెనకంజలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కో యన్సన్, కేశవ్ మహారాజ్, బాష్, హార్మర్ చెరో వికెట్ పడగొట్టారు.

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×