E-Paper
Advertisement

Nag Ashiwn: ఆ దిగ్గజ దర్శకుడి రీఎంట్రీ.. నిర్మాతగా నాగ్ అశ్విన్

Nag Ashiwn: ఆ దిగ్గజ దర్శకుడి రీఎంట్రీ.. నిర్మాతగా నాగ్ అశ్విన్
Advertisement

Singeetam Srinias Re Entry: తెలుగు సినిమాలు గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడారు అంటే వాళ్లకి పూర్తిస్థాయిలో అవగాహన లేదు అని చెప్పాలి. ఒక టైం లో వరుసగా తెలుగు సినిమాలు కమర్షియల్ పంథాలో వెళ్లిపోయాయి. కానీ ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన, వైవిద్యమైన సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చాయి. చాలామంది దిగ్గజ దర్శకులు గొప్ప గొప్ప సినిమాలు తీశారు. తెలుగు సినిమాల నుంచి కూడా కాపీ కొట్టడం అప్పట్లోనే మొదలుపెట్టారు.

మరోసారి మెగాఫోన్ పట్టనున్న సింగీతం శ్రీనివాస్

Advertisement

ఇప్పుడు అందరూ హాలీవుడ్ హాలీవుడ్ అంటారు గానీ ఒకప్పుడు తెలుగు సినిమా ఆలోచనలే నెక్స్ట్ లెవెల్ లో ఉండేవి. కే విశ్వనాథ్, దాసరి నారాయణరావు, సింగీతం శ్రీనివాసరావు వంటి ఎంతోమంది దర్శకులు అద్భుతమైన సినిమాలు తీశారు. వీరందరిలో కంటే సంగీతం శ్రీనివాసరావు సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. ఆరోజుల్లోనే ఒక భైరవద్వీపం, ఆదిత్య 369 వంటి సినిమాలను ఊహించడం అనేది మామూలు విషయం కాదు. వయసు రీత్యా ఆయన ఇప్పుడు సినిమాలు చేయటం ఆపేశారు. మళ్లీ ఆ దిగ్గజ దర్శకులు సంగీతం శ్రీనివాసరావు మెగా ఫోన్ పట్టుకొనున్నట్లు తెలుస్తోంది.

సింగీతం శ్రీనివాస్ దర్శకుడుగా

సంగీతం శ్రీనివాస్ దర్శకుడిగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి నిర్మాతగా నాగ్ అశ్విన్ వ్యవహరిస్తారు. దేవిశ్రీ ప్ర‌సాద్ ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకొన్నార‌ని తెలుస్తోంది. న‌టీన‌టులంతా దాదాపుగా కొత్త‌వారే. సింగీతం స్టైల్ లో ఈ చిత్రాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కించ‌బోతున్నార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న నాగ్ అశ్విన్ తీసింది కేవలం మూడు సినిమాలే. అయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సాధించుకున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగి. నాని విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఆ సినిమా ఇప్పటికీ చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అసలు ఆ ఆలోచన విధానమే కొత్తగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన మహానటి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

Advertisement

Also Read: Akhanda 2 : అఖండ 2 సినిమా ఇంటర్వెల్ చూసి వచ్చేయండి, అంత మాట అనేసావేంటి తమన్?

సింగీతానికి వీరాభిమాని

ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇక కల్కి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేసింది. అయితే సింగీతం శ్రీనివాస్ రావు వర్క్ అంటే విపరీతమైన ఇష్టం నాగ్ అశ్విన్ కు. తాను తీసిన ఎన్నో సినిమాలు గురించి అనర్గళంగా మాట్లాడుతాడు నాగి. గతంలో అపూర్వ సోదరులు సినిమా ఈవెంట్ జరిగినప్పుడు చెన్నై వెళ్లి మరి సంగీతం గారి టాలెంట్ గురించి మాట్లాడారు. అయితే డైలాగులు లేకుండా పుష్పక విమానం అనే సినిమా కూడా చేశారు సింగీతం. ఇప్పుడు దర్శకులు అందరూ పాన్ ఇండియా అని ఆలోచిస్తారు. కానీ సింగీతం చేసిన పుష్పక విమానం సినిమా కదా అసలైన పాన్ ఇండియా కాన్సెప్ట్ అని అర్థమవుతుంది. ఎలానో మాటలు ఉండవు కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. మొత్తానికి అటువంటి సంగీతం శ్రీనివాసరావు మళ్లీ డైరెక్షన్ చేస్తున్నారు అంటే చాలామందికి విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×