E-Paper
Advertisement

అసలే మొహమాటం.. పైగా అలాంటి సీన్లు, స్టార్ హీరోకు ముద్దు కష్టాలు.. నో చెప్పిన వినని డైరెక్టర్!

అసలే మొహమాటం.. పైగా అలాంటి సీన్లు, స్టార్ హీరోకు ముద్దు కష్టాలు.. నో చెప్పిన వినని డైరెక్టర్!
Advertisement

Prabhas Spirit:డార్లింగ్ ప్రభాస్ అంటేనే ఆరడుగుల కటౌట్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు. అలాంటి ప్రభాస్  పర్సనల్ లైఫ్‌లో ఎంత సిగ్గుపడతారో, హీరోయిన్లతో మాట్లాడాలన్నా ఎంత మొహమాటపడతారో మనం చాలా ఇంటర్వ్యూల్లో చూశాం కూడా. అలాంటి ప్రభాస్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా లాంటి ‘రా’ అండ్ ‘బోల్డ్’ డైరెక్టర్ తో స్పిరిట్ చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే లేటెస్ట్ గా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా గురించి వస్తున్న ఒక క్రేజీ అప్ డేట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

ఇప్పటి వరకు అలాంటి సీన్లు చేయని ప్రభాస్

Advertisement

యస్ …స్పిరిట్ సినిమాలో తొలిసారి ప్రభాస్ ఒక లెంగ్తీ లిప్ లాక్ సీన్‌లో నటించారట.సాధారణంగా ప్రభాస్ సినిమాల్లో రొమాన్స్ ఉన్నా అది చాలా పద్ధతిగా, డీసెంట్‌గా ఉంటుంది. కానీ సందీప్ వంగా అలా కాదు. ఆయన సినిమాలో ఎమోషన్ పండాలంటే రొమాన్స్ కూడా అంతే డీప్‌గా ఉండాలనుకుంటారు.అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలు అది ప్రూవ్ చేశాయ్ కూడా.ఈ క్రమంలోనే స్పిరిట్ కథలో ఒక కీలక సందర్భంలో వచ్చే ఈ కిస్ సీన్ గురించి ప్రభాస్‌కు చెప్పినప్పుడు,ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారట.”అసలు నా వల్ల అవుతుందా ..ఇలాంటి సీన్లు ఇప్పటివరకు చేయలేదు, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో” అని మొహమాటపడ్డాడట డార్లింగ్.అయితే  మొదట ‘నో’ అన్నా, సందీప్ వంగా మాత్రం వదలకుండా ఆ సీన్ వెనుక ఉన్న ఇంటెన్సిటీని, అది కథను ఎంతలా ఎలివేట్ చేస్తుందో వివరించి డార్లింగ్‌ను ఒప్పించారని ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.

చాలా ప్రైవేట్‌గా ఈ లిప్ లాక్ సీన్‌ను షూట్ చేసిన డైరెక్టర్ 

Advertisement

ఇక షూటింగ్ రోజే అసలైన డ్రామా జరిగిందట.ప్రభాస్ ఆ సీన్ చేయడానికి సిద్ధపడినా, సెట్‌లో అందరూ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారట ప్రభాస్. దీంతో హీరో ఇబ్బందిని అర్థం చేసుకున్న డైరెక్టర్ వెంటనే రంగంలోకి దిగి, సెట్‌ను ఖాళీ చేయించేశారు. కేవలం కెమెరామెన్, డైరెక్టర్ తప్ప మరెవరూ అక్కడ లేకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తానికి అతి తక్కువ మంది సమక్షంలో,చాలా ప్రైవేట్‌గా ఈ లిప్ లాక్ సీన్‌ను షూట్ చేశాడట డైరెక్టర్ సందీప్ వంగా.ఇక ఆ సమయంలో ప్రభాస్ పడ్డ ‘ముద్దు’ కష్టాలు చూసి సెట్‌లో ఉన్న కొందరు నవ్వుకున్నారట కూడా. ఏది ఏమైనా ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ప్రభాస్, ఇలాంటి ఒక సీన్ కోసం కష్టపడ్డాడన్న వార్త  ఇప్పుడు ఇండస్ట్రీలో  హాట్ టాపిక్ అయిపొయింది.

also read:ఏంటీ.. సినిమా టికెట్ 90 వేలా? నిమిషాల్లో క్లోజ్ అయిన బుకింగ్స్.. క్రేజ్ మామూలుగా లేదుగా!

వంగా మ్యాజిక్, ప్రభాస్ క్రేజ్ కలిస్తే థియేటర్లలో రచ్చ

అయితే  ఓ వైపు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపిస్తూనే, మరోవైపు ఇంతటి ఘాటు రొమాన్స్ చేయడం అనేది నిజంగా ఒక పెద్ద సాహసమే. ఇక ప్రభాస్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, కేవలం డైరెక్టర్ విజన్ కోసం ఈ సీన్ చేశారంటే, ఆ సీన్ సినిమాలో ఎంత స్పెషల్‌గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వంగా మ్యాజిక్, ప్రభాస్ క్రేజ్ కలిస్తే థియేటర్లలో రచ్చ మాములుగా ఉండదని పిక్స్ అయిపోతున్నారు రెబల్ ఫ్యాన్స్.చూస్తుంటే వంగా గత సినిమాల లాగే ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యాక ఈ లెంగ్తీ లిప్ లాక్ చుట్టూ పెద్ద డిస్కషన్ నడిచేలానే ఉంది.

వచ్చే ఏడాది మార్చి 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్

ఇక సినిమా విషయానికి వస్తే  భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్, టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో  త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా కనిపించనుండగా వివేక్‌ ఒబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే  ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే. చూడాలి మరి కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా తొలిసారి లెంగ్తీ లిప్ లాక్ సీన్‌ చేస్తున్న డార్లింగ్ స్పిరిట్ తో ఎన్ని వందల కోట్లు కొల్లగొడతాడో చూడాలి.

also read:టైర్-1 స్టార్లు లేని బాక్సాఫీస్.. ఈ సినిమాలైనా సమ్మర్‌ను కూల్ చేస్తాయా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×