E-Paper
Advertisement

ఏంటీ.. సినిమా టికెట్ 90 వేలా? నిమిషాల్లో క్లోజ్ అయిన బుకింగ్స్.. క్రేజ్ మామూలుగా లేదుగా!

ఏంటీ.. సినిమా టికెట్ 90 వేలా? నిమిషాల్లో క్లోజ్ అయిన బుకింగ్స్.. క్రేజ్ మామూలుగా లేదుగా!
Advertisement

Dune Tickets : సినిమా సరిగ్గా క్లిక్ అయితే ఆడియన్స్ ఏ రేంజ్ లో వెర్రెత్తిపోతారో మరోసారి ప్రూవ్ చేస్తుంది ‘డ్యూన్’ సిరీస్. యస్… హాలీవుడ్ వెండితెరపై విజువల్ వండర్స్‌ను ఆవిష్కరించే దర్శకుడు డెనిస్ విల్లెనెవ్ సృష్టించిన ఈ ‘డ్యూన్’ వరల్డ్ ఇపుడు మరోసారి గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.ఈ ఫ్రాంచైజీలో రాబోతున్న మూడవ భాగం ‘డ్యూన్: మెస్సయ్య’ (Dune 3) కోసం సినీ లవర్స్ ఎంతలా వెర్రెత్తిపోతున్నారో చెప్పడానికి రీసెంట్ బుకింగ్స్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.ఈ ఏడాది డిసెంబర్ 18, 2026న విడుదల కానున్న ఈ సినిమా కోసం నెలల ముందే మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ పండిట్స్ సైతం షాక్ అవుతున్నారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఐమ్యాక్స్ 70mm (IMAX 70mm) టికెట్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందండోయ్.

ఒక్కో టికెట్ ధర భారత కరెన్సీలో సుమారు రూ. 90,000

Advertisement

అఫీషియల్  వెబ్‌సైట్లలో సోల్డ్ అవుట్ అయిన ఈ టికెట్లు ఇప్పుడు బ్లాక్ మార్కెట్ మరియు రీసేల్ వెబ్‌సైట్లలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడవుతున్నాయి. అమెరికాలోని న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ తో పాటు లండన్ వంటి నగరాల్లో ఒక్కో టికెట్ ధర భారత కరెన్సీలో సుమారు రూ. 90,000 వరకు పలుకుతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మూడు గంటల సినిమా కోసం లక్ష రూపాయల దగ్గరగా ఖర్చు చేయడం ఏంటని సామాన్యులు ఆశ్చర్యపోతుంటే, సినిమా లవర్స్  మాత్రం ఇది కేవలం సినిమా కాదు, ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని సమాధానమిస్తున్నారు.

also read:ఆదిత్య ధర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ప్రభాస్-సూర్య మల్టీస్టారరా.. లేక రామ్ చరణ్ ‘అశ్వత్థామ’నా? ఫ్యాన్స్‌లో మొదలైన టెన్షన్!

Advertisement

కేవలం 19 లొకేషన్లలో మాత్రమే అందుబాటులో

ఇంతటి క్రేజ్‌కు వెనుక  టెక్నికల్ గా ఓ సాలిడ్ రీజన్ ఉంది. దర్శకుడు విల్లెనెవ్ ఈ చిత్రాన్ని డిజిటల్ కెమెరాలతో కాకుండా, అత్యంత ఖరీదైన మరియు నాణ్యమైన 70mm ఫిల్మ్ కెమెరాలతో షూట్ చేశారు. ఈ ఫార్మాట్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ సైజు, విజువల్ డెప్త్ ప్రేక్షకుడిని నేరుగా ‘అరాకిస్’ గ్రహం మీదకు తీసుకెళ్లిన అనుభూతిని కలిగిస్తాయి. సాధారణ స్క్రీన్‌పై చూసే సినిమాకు, ఈ ఐమ్యాక్స్ 70mm స్క్రీన్‌పై చూసే విజువల్స్‌కు క్వాలిటీలో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇంతటి భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ స్పెషల్ ఫార్మాట్‌ను ప్రదర్శించే సామర్థ్యం ఉన్న థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయి. అమెరికా మరియు యూకే మొత్తం కలిపి కేవలం 19 లొకేషన్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆ కొన్ని వందల సీట్ల కోసం పోటీ పడుతున్నారు.

ఒక్క టికెట్ కొనే డబ్బుతో ఒక మంచి బైక్

డిమాండ్ విపరీతంగా ఉండటం మరియు సప్లై (స్క్రీన్స్) తక్కువగా ఉండటంతో ఈ టికెట్ల రేటు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. అయితే  ఒక్క టికెట్ కొనే డబ్బుతో ఒక మంచి బైక్ లేదా రెండు ఐఫోన్లు కొనేయొచ్చని  మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు.మరోవైపు,ఈ టికెట్ల కోసం కొందరు ఫ్యాన్స్ వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇతర నగరాలకు వెళ్లేందుకు  ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. విజువల్స్‌లో ఏమాత్రం రాజీ పడకూడదనే దర్శకుడి విజన్ మరియు దాన్ని వెండితెరపై ఆస్వాదించాలనే ఆడియన్స్ కసి వెరసి ‘డ్యూన్ 3’ని ఒక గ్లోబల్ ఈవెంట్‌గా మార్చేశాయన్న మాట.ఇక  ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ మరియు మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేయగా, డిసెంబర్ 18న థియేటర్ల వద్ద ఇంకెన్ని వింతలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి లక్ష రూపాయలు పెట్టి సినిమా చూసే ఆడియన్స్‌ను ఈ విజువల్ మ్యాజిక్ ఏ స్థాయిలో సాటిస్ ఫై చేస్తుందో  ఎన్ని వేల కలెక్షన్స్ కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే.

also read:జాకీచాన్‌లా రెచ్చిపోయిన వర్మ.. ఏకంగా నిర్మాతనే కొడుతూ.. వీడియో వైరల్

Related News

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×