E-Paper
Advertisement

టైర్-1 స్టార్లు లేని బాక్సాఫీస్.. ఈ సినిమాలైనా సమ్మర్‌ను కూల్ చేస్తాయా?

టైర్-1 స్టార్లు లేని బాక్సాఫీస్.. ఈ సినిమాలైనా సమ్మర్‌ను కూల్ చేస్తాయా?
Advertisement

Tollywood Summer: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు అసలైన సమ్మర్ హీట్ మొదలైంది కానీ, విచిత్రం ఏంటంటే ఎటాక్ చేయాల్సిన పెద్ద సినిమాలు సైలెంట్ గా జారుకోవడమే.అలా ఏప్రిల్ 30న వస్తుందనుకున్న ‘పెద్ది’ ప్యాకప్ చెప్పేసి రావడం లేదని కన్ఫర్మ్ అయ్యాక,ఇప్పుడు చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ పై దండయాత్రకు రెడీ అయిపోయాయి.ఇక మే నెల అయినా పెద్ద సినిమాలు ఎంట్రీ ఇస్తాయనుకుంటే ఈనెల కూడా కేవలం మీడియం రేంజ్ సినిమాలతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి.

వింత ప్రమోషన్లు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో

Advertisement

వీళ్ళందరిలో ఏప్రిల్  గ్యాప్ ని క్యాష్ చేసుకోవడంలో తరుణ్ భాస్కర్ అందరికంటే ముందున్నాడని అనుకోవాలి, ఎందుకంటే ‘గాయపడ్డ సింహం’ అంటూ మే 1న లాక్ చేసుకున్న ఈ టీమ్ కు పెద్ద సినిమాలు లేకపోవడం ఒక రకంగా కలిసొచ్చే అంశమే అయినా, ఈ కామెడీ యాక్షన్ డ్రామా కోసం టీమ్ చేస్తున్న వింత వింత ప్రమోషన్లు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. అదృష్టం బాగుండి ఈ ‘సింహం’ బాక్సాఫీస్ దగ్గర గాండ్రించకపోతే మాత్రం తరుణ్ భాస్కర్ ఆశలపై నీళ్లు చల్లినట్టే.

also read:ఏంటీ.. సినిమా టికెట్ 90 వేలా? నిమిషాల్లో క్లోజ్ అయిన బుకింగ్స్.. క్రేజ్ మామూలుగా లేదుగా!

Advertisement

జెట్ స్పీడ్ తో పాతాళానికి పడిపోవడం ఖాయం

మరోవైపు కమెడియన్ నుంచి హీరోగా మారడం ఈ కాలంలో కత్తి మీద సాము లాంటి వ్యవహారం అని తెలిసినా, సత్య ‘జెట్లీ’తో రిస్క్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ అండ ఉంది కాబట్టి మే 8న థియేటర్లలో రచ్చ గ్యారెంటీ అని రషెస్ చూసిన వాళ్ళు ఊదరగొడుతున్నారు కానీ, రితేష్ రానా మార్కు క్రేజీ కామెడీ సగటు ప్రేక్షకుడికి ఎక్కుతుందా లేదా అన్నది అనుమానమే. ఒకవేళ ఇది కనుక  తేడా కొడితే సత్య హీరో కలలు జెట్ స్పీడ్ తో పాతాళానికి పడిపోవడం ఖాయం.ఇక సమంత ‘మా ఇంటి బంగారం’ పరిస్థితి మరీ విచిత్రం.ప్లాన్స్ మార్చుకుని ముందే రావాలని ఎంత ట్రై చేసినా కుదరక మే 15 డేట్ కే కట్టుబడాల్సి రావడం సామ్ కి ఒక రకమైన తలనొప్పిగా మారింది. అప్పటికే సత్య, తరుణ్ భాస్కర్ సినిమాల రిజల్ట్ తేలిపోతుంది కాబట్టి, ఆ కాంపిటీషన్ ని తట్టుకుని ఈమె ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి.

ఓటేస్తారా లేక నీరసంగా సైలెంట్ అయిపోతారా

నిజానికి తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ సినిమాల తాకిడి లోకల్ సినిమాలకి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మే 1న మమ్ముట్టి-మోహన్ లాల్ ల ‘పాట్రియాట్’, సాయి పల్లవి హిందీ ఎంట్రీ ‘ఏక్ దిన్’ తో పాటు రితేష్ దేశముఖ్ ‘రాజా శివాజీ’ లాంటి ఉద్ధండులు లైన్ లో ఉండటం చూస్తుంటే, మన మీడియం బడ్జెట్ సినిమాల పునాదులు కదిలేలా ఉన్నాయి. దీనికి తోడు ఏప్రిల్ 30నే ధనుష్ ‘కార’, ధ్రువ సర్జ ‘కెడి డెవిల్’ వస్తుండటం మన హీరోలకి మింగుడు పడని విషయమే. రాబోయే 50 రోజులు బాక్సాఫీస్ దగ్గర టైర్ 1 స్టార్లు లేకపోవడం అనేది టాలీవుడ్ మార్కెట్ కి పెద్ద మైనస్. ఏప్రిల్ 17న వచ్చే నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’, కిరణ్ అబ్బవరం ‘తిమ్మరాజుపల్లి టీవీ’, తిరువీర్ ‘పాపం ప్రతాప్’ లాంటి చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి కానీ, పెద్ద సినిమాలు లేని లోటును ఈ చిన్న కంటెంట్లు భర్తీ చేస్తాయా లేక థియేటర్లు వెలవెలబోతాయా అన్నది ఆలోచించాల్సిన విషయమే.ఏది ఏమైనా ప్రేక్షకులకు ఆప్షన్ లేక వీటికి ఓటేస్తారా లేక నీరసంగా సైలెంట్ అయిపోతారా అనేది మే నెల బాక్సాఫీస్ లెక్కలే తేల్చాలి.

also read:జాకీచాన్‌లా రెచ్చిపోయిన వర్మ.. ఏకంగా నిర్మాతనే కొడుతూ.. వీడియో వైరల్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×