Spirit Movie : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ప్రభాస్ నుంచి రాజా సాబ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కి ముందు వచ్చిన బజ్ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో అరడజనుకు ఫౌజీ సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వచ్చే ఏడాది స్పిరిట్ మూవీ రిలీజ్ కాబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయినట్లు తెలుస్తుంది. ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ లుక్ లో ప్రభాస్ ఎలా ఉన్నాడో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..
యానిమల్ మూవీతో బాలివుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ఆయనతో సినిమాల చేసేందుకు తెలుగు హీరోలతో పాటుగా బాలీవుడ్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు.. ప్రస్తుతం ఈ డైరెక్టర్ టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి రోజుకో రకమైన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చి ఫాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయిందని ఫోటో బయటకి వచ్చింది.. ఆ ఫోటోలో ప్రభాస్ పంచకట్టులో చాలా అందంగా కనిపిస్తున్నాడు. తెల్లటి పంచెలో పొడవాటి జుట్టుతో చేతిలో గన్ పట్టుకొని స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని ప్రభాస్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఆ ఫోటోలు ఫాన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్ ను అలా చూసిన అమ్మాయిలు అబ్బా డార్లింగ్ ఏమున్నాడు రా బాబు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు… మొత్తానికి ఆ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read :హాలీవుడ్ లోకి నిఖిల్.. తెలుగు సినిమాలకు గుడ్ బై..?
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాతో మరింత పవర్‌ఫుల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. డార్లింగ్ నుంచి వస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రంపై ఇప్పటికే జనాల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీని వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి థియేటర్లోకి తీసుకొని వచ్చే ప్లాన్లో వంగ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు బయటకొచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తృప్తి దిమ్రి ప్రభాస్ కి జోడిగా ఈ సినిమాలో నటిస్తుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. మూవీ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసేందుకు డైరెక్టర్ ఒక ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఏకధాటిగా 60 రోజుల పాటు కొనసాగే భారీ షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టే ఆలోచనలో సందీప్ రెడ్డి వంగ ఉన్నట్లు తెలుస్తుంది. 2027 మార్చి 5 న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.