E-Paper
Advertisement

NEET-UG 2026: నీట్ ఎగ్జామ్‌పై ఎన్టీఏ-కేంద్ర మంత్రి ప్రకటన.. జూన్ 21న పరీక్ష, విద్యార్థుల్లో కొత్త టెన్షన్

NEET-UG 2026: నీట్ ఎగ్జామ్‌పై ఎన్టీఏ-కేంద్ర మంత్రి ప్రకటన.. జూన్ 21న పరీక్ష, విద్యార్థుల్లో కొత్త టెన్షన్
Advertisement

NEET-UG 2026: పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ పరీక్షకు షెడ్యూల్ ప్రకటించింది ఎన్టీయే. మళ్లీ ఎంట్రన్స్ పరీక్ష జూన్ 21న నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం ప్రకటించింది. ఇక హాల్‌ టికెట్‌, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించమని తెలియజేసింది. నీట్ ఎగ్జామ్‌కు రావడంతో విద్యార్థులు రెడీ అవుతున్నారు.

నీట్ ఎగ్జామ్‌పై ఎన్టీఏ-కేంద్ర మంత్రి ప్రకటన

Advertisement

ప్రశ్నాపత్రం లీక్‌ ఆరోపణలతో నీట్‌ యూజీ 2026 పరీక్షను రద్దు చేసింది ఎన్టీయేజ మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. జూన్‌ 21న అనగా ఆదివారం పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈ మేరకు తమ ఎక్స్‌ వేదికగా తెలియజేసింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక సమాచారాన్ని విద్యార్థులు తీసుకోవాలని ఎన్‌టీఏ కోరింది.

హాల్ టికెట్ ఎప్పుడు, మిగతా వివరాలను త్వరలో వెల్లడించనుంది. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం మే మూడున అర్హత ప్రవేశ పరీక్ష నిర్వహించింది ఎన్టీఏ. దేశంలో 551 సెంటర్లు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాలు కొన్నిచోట్ల లీకయ్యాయని ఆరోపణల తీవ్రమైన నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ఎన్‌టీఏ ప్రకటన చేసింది.

Advertisement

జూన్ 21న పరీక్ష.. పేపర్ ఎలా ఉంటుందోనని విద్యార్థుల్లో టెన్షన్

దీంతో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీఎగ్జామినేషన్‌కు దరఖాస్తు చేసుకోనక్కర్లేదని, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో జూన్ 21న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేసింది. నీట్ పరీక్ష నిర్వహణపై కేంద్రం హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు.

ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న వార్త తెలియగానే విచారణకు ఆదేశించామన్నారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరీక్ష పారదర్శకంగా నిర్వహించడమే మా ప్రధాన కర్తవ్యమన్నారు. పేపర్ లీక్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది నీట్ పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహిస్తామన్నారు.

ALSO READ: విద్యార్థులకు బంపరాఫర్.. 9 నుంచి పీజీ వరకు, నెలకు వెయ్యి మీ సొంతం, ఇంకెందుకు ఆలస్యం

నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమన్నారు. పేపర్ ఎలా లీక్ అయ్యింది? ఎవరి నుంచి ఎక్కడికి వెళ్లిందనేది పూర్తి వివరాలు బహిర్గతమవుతాయన్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని వివరించారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి భయపడొద్దన్నారు. అడ్మిట్ కు సంబంధించి ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు రీఎగ్జామ్ అనేసరికి విద్యార్థులను టెన్షన్ వెంటాడుతోంది. ఈసారి పేపర్ ఏ విధంగా ఉంటుందోనన్న భయం అప్పుడే మొదలైంది. గతంలో రీఎగ్జామ్ జరిగినప్పుడు  పేపర్ చాలా కఠినంగా వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు.

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×