E-Paper
Advertisement

బుచ్చిబాబును కారులో రైడ్‌కి తీసుకెళ్లిన రామ్ చరణ్.. ‘పెద్ది’ ట్రైలర్‌పై మరింత క్లారిటీ..

బుచ్చిబాబును కారులో రైడ్‌కి తీసుకెళ్లిన రామ్ చరణ్.. ‘పెద్ది’ ట్రైలర్‌పై మరింత క్లారిటీ..
Advertisement

Peddi Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi) గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఈ సినిమా విశేషాలను దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా పంచుకున్నారు.

Read also-టాలీవుడ్‌లో వివాదాలకు పరిష్కారమే లక్ష్యంగా ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం..

క్రేజీ చిట్-చాట్

Advertisement

ఈ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా కారు నడుపుతుండగా, పక్క సీట్లో కూర్చున్న బుచ్చిబాబు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “నన్ను డ్రైవ్‌కు తీసుకువచ్చింది ఎవరో తెలుసా?” అంటూ చరణ్‌ను చూపిస్తూ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ ఎప్పుడంటే?

సినిమా అప్‌డేట్స్ కోసం వేచి చూస్తున్న అభిమానుల తరపున రామ్ చరణ్, బుచ్చిబాబును ఒక ప్రశ్న అడిగారు. “ఈ కబుర్లు ఆపి, మన సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందో అందరికీ చెప్పండి” అని చరణ్ అనడంతో, బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. మే 18న ‘పెద్ది’ చిత్ర ట్రైలర్ విడుదల కాబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ డేట్‌పై చరణ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేయించానని బుచ్చిబాబు గుర్తు చేశారు.

Advertisement

Read also-Karthika Deepam 2 Serial Today Episode May 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ :  దీపను చంపేస్తానన్న జ్యోత్స్న

ట్రైలర్ ఎలా ఉండబోతోంది?

ట్రైలర్ కంటెంట్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఈ ట్రైలర్ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు అత్యంత ఎమోషనల్‌గా ఉండబోతోంది. సినిమాలో ఏవిధంగా అయితే సర్ప్రైజ్‌లు ఉంటాయో, ట్రైలర్‌లో కూడా అవే కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కారు ప్రయాణంలో సినిమాకు సంబంధించిన అనుభవాలు, షూటింగ్ విశేషాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఇది అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటరాక్షన్ అని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు. మొత్తానికి ‘పెద్ది’ ట్రైలర్ డేట్ ఫిక్స్ అవ్వడంతో మెగా అభిమానుల్లో అప్పుడే పండగ వాతావరణం మొదలైంది. మరి 18వ తేదీన బుచ్చిబాబు ఎటువంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.

Related News

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

Big Stories

Advertisement
×