E-Paper
Advertisement

Prabhas Record: ఓవర్సీస్ వద్ద రెబల్ స్టార్ ప్రభాస్ వన్ మ్యాన్ షో.. ఏంది సామీ ఆ రికార్డులు..

Prabhas Record: ఓవర్సీస్ వద్ద రెబల్ స్టార్ ప్రభాస్ వన్ మ్యాన్ షో.. ఏంది సామీ ఆ రికార్డులు..
Advertisement

Prabhas Record: తెలుగు సినిమాను ప్రాంతీయ సరిహద్దులు దాటించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత ‘రెబల్ స్టార్’ ప్రభాస్‌ది. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ‘పాన్ ఇండియా’ ట్రెండ్‌కు పునాది వేసిన ఆయన, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. తాజాగా అందిన గణాంకాల ప్రకారం, విదేశీ మార్కెట్‌లో 10 మిలియన్ డాలర్లు ($10 Million) మైలురాయిని అత్యధిక సార్లు అధిగమించిన ఏకైక టాలీవుడ్ హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించారు.

Read also-OTT Movies : ఓటీటీ లవర్స్ కు బిగ్ షాక్.. ఇక సినిమాలు అప్పుడే స్ట్రీమింగ్..!

ప్రభాస్ వన్-మ్యాన్ షో

Advertisement

టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం 7 సినిమాలు మాత్రమే ఓవర్సీస్ మార్కెట్‌లో 10 మిలియన్ డాలర్ల మార్కును దాటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడు చిత్రాలలో 5 చిత్రాలు కేవలం ప్రభాస్ నటించినవే కావడం ఆయన ‘కింగ్-సైజ్’ డామినేషన్‌ను సూచిస్తోంది. మిగిలిన ఇద్దరు అగ్ర హీరోలు (ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్) చెరో సినిమాతో ఈ జాబితాలో ఉండగా, ప్రభాస్ ఒక్కరే ఐదు సినిమాలతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ అద్భుతమైన 5 చిత్రాలు ఏంటంటే.. ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ ఈ చిత్రం సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది టాలీవుడ్ స్థాయిని శిఖరాగ్రానికి చేర్చింది. ‘కల్కి 2898 AD’ సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రం విదేశీ ప్రేక్షకులను విశేషంగా అలరించి భారీ వసూళ్లను రాబట్టింది. ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ప్రభాస్ మాస్ పవర్‌ను ఓవర్సీస్‌లోనూ ప్రూవ్ చేసింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ అసలు సిసలైన గ్లోబల్ మార్కెట్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం ఇది. ‘సాహో’ టాక్‌తో సంబంధం లేకుండా ప్రభాస్ ఇంటర్నేషనల్ ఇమేజ్ కారణంగా ఈ చిత్రం ఈ భారీ మైలురాయిని చేరుకుంది.

Read also-Rashmika Rakshit: నెట్టింట వైరల్‌గా మారిన రక్షిత్ శెట్టి వీడియో.. రష్మికపై కామెంట్స్ వెనుక..

రికార్డుల రారాజు

Advertisement

ఒక సినిమాతో ఈ ఫీట్ సాధించడం గొప్ప విషయమైతే, ఐదు వేర్వేరు చిత్రాలతో అదే మ్యాజిక్‌ను పునరావృతం చేయడం ప్రభాస్ రేంజ్‌ను తెలియజేస్తుంది. ఈ జాబితాలో ఉన్న ఇతర రెండు చిత్రాలు ‘RRR’, ఇటీవల సెన్సేషన్ సృష్టించిన ‘పుష్ప 2’. వీటిని పక్కన పెడితే, ప్రభాస్ తన సినిమాలతో ఒక సుస్థిరమైన మార్కెట్‌ను విదేశాల్లో ఏర్పాటు చేసుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాజా సాబ్’, ‘సలార్ 2’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలు కూడా ఈ జాబితాలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశీ గడ్డపై తెలుగు సినిమా జెండాను ఎగురవేయడంలో ప్రభాస్ పోషిస్తున్న పాత్ర అనితరసాధ్యం. బాక్సాఫీస్ వద్ద ఆయన చూపిస్తున్న ఈ “కింగ్ సైజ్ డామినేషన్” టాలీవుడ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. రెబల్ స్టార్ మరెన్ని రికార్డులు బద్దలు గొడతాడో చూడాలి మరి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ మూవీ పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×