E-Paper
Advertisement

Prabhas: పూరీలా ఎవరూ రాయలేడు.. ‘ఏక్ నిరంజన్’ డైలాగ్స్‌‌ని ఆ సినిమాకు వాడుకున్నారు

Prabhas: పూరీలా ఎవరూ రాయలేడు.. ‘ఏక్ నిరంజన్’ డైలాగ్స్‌‌ని ఆ సినిమాకు వాడుకున్నారు
Advertisement

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఎవరంటే.. వెంటనే వినిపించే పేరు పూరీ జగన్నాథ్ (Director Puri Jagannadh). ప్రస్తుతం ఆయనకు సరైన ప్రాజెక్ట్ పడక, అలా వెనుకబడిపోయారు కానీ, లేదంటే.. మొదటి పాన్ ఇండియా సెన్షేషన్‌గా ఆయన పేరు వినబడాల్సింది. దర్శకధీరుడు రాజమౌళి, సుకుమార్ వంటి వారు కూడా బాగా ఇష్టపడే దర్శకుడు పూరీ జగన్నాధ్. ఇప్పుడు దర్శకుల్లో హీరోయిజాన్ని చూపించాలంటే పూరీ తర్వాతే ఎవరైనా? ఈ విషయాన్ని స్వయంగా డార్లింగ్ ప్రభాస్ కూడా అంగీకరించారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. తనకు ‘వర్షం’ వంటి సినిమాను ఇచ్చిన దర్శకుడి కుమారుడైన సంతోష్ శోభన్‌ సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly)కి సపోర్ట్ చేసేందుకు ఓ ఇంటర్వ్యూని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో పూరీ ప్రస్తావనను సంతోష్ తీసుకొచ్చారు.

Also Read- Nagarjuna: బిగ్ బాస్ 10 కోసం నాగార్జున భారీ రెమ్యునరేషన్.. ఎంత తీసుకుంటున్నారంటే..!

సినిమాలు బోల్తా కొట్టి ఉండవచ్చు కానీ..

Advertisement

తనకు ‘ఏక్ నిరంజన్’ సినిమా అంటే ఎంతో ఇష్టమని, అందులో ఉండే హీరోయిజం చాలా వెరైటీగా ఉంటుందని, ఈ సినిమా అంటే నాకు పిచ్చి అని, అందులోని డైలాగ్స్ కొన్ని చెప్పారు. వెంటనే అందుకున్న ప్రభాస్, తను పూరీతో చేసిన ‘బుజ్జిగాడు’ (Bujjigadu), ‘ఏక్ నిరంజన్’ (Ek Niranjan) సినిమాలంటే తనకు కూడా చాలా ఇష్టమని చెప్పారు. ప్రభాస్‌కు మంచి పేరు, ఇమేజ్ తెచ్చిన సినిమాలంటే ముందు వరసలో ఉండేది మాత్రం ఈ రెండు సినిమాలే. ఇందులో ప్రభాస్ హీరోయిజాన్ని పూరీ ఎలివేట్ చేసిన తీరు, ఆయనకు ఫ్యాన్స్‌ని సాధించి పెట్టింది. సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి ఉండవచ్చు కానీ, ఇందులో ప్రభాస్ ఎనర్జీకి అంతా ఫిదా అవ్వాల్సిందే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

Also Read- Actress Meena : కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు.. ఫైర్ అవుతున్న మీనా.. అసలేమైందంటే?

ఇమిటేట్ కూడా ఎవ్వరూ చేయలేరు

Advertisement

ఈ సందర్భంగా పూరీ రైటింగ్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. పూరీగా ఎవడూ రాయలేడు. ‘బుజ్జిగాడు క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు నిజంగా పిచ్చెక్కిపోయింది. ముందు భయం కూడా వేసింది. ఇలాంటి పాత్రను నేను చేయగలనా? అని. అప్పట్లో నేను ఏం మాట్లాడినా, ఆ సినిమా వెర్షన్‌లోనే మాట్లాడేవాడిని. అంతగా ఆ సినిమాకు నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఆయన డిజైన్ చేసినట్లుగా హీరో పాత్రను ఎవ్వడూ డిజైన్ చేయలేరు. తర్వాత మా నుంచి ‘ఏక్ నిరంజన్’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో పాత్ర కూడా చాలా టిపికల్‌గా ఉంటుంది. పూరి రైటింగ్‌ని ఇమిటేట్ చేయడం కూడా ఎవరి వల్లా కాదు. ‘ఏక్ నిరంజన్’ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ని పూరీకి సోనూసూద్ ఫోన్ చేసి మేం వాడుకుంటామని అడిగారు. తను అసలే సూపర్ కూల్.. వెంటనే ఓకే అనేశారు. ‘దబాంగ్’లో ‘ఏక్ నిరంజన్’ సినిమా డైలాగ్స్ కొన్ని వాడారు’’ అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read- Vijay Rashmika wedding: విజయ్ రష్మిక వెడ్డింగ్ ఇన్విటేషన్ తో పాటు ఇచ్చిన గిఫ్ట్ ఇవే!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×