Prabhas -Prashanth Neel: పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో 418 సినిమా (418 Movie)ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.కీర్తన్ గౌడ దర్శకత్వంలో ఈ హారర్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఇందులో చైత్ర జె.ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) కూడా భాగం అయ్యారు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో కలిసి ఒక చిన్న వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా ప్రభాస్ 418 సినిమాపై ప్రశంసలు కురిపించారు.
418 మూవీ ట్రైలర్ చూసిన ప్రభాస్.. ప్రశాంత్ నీల్, కీర్తన్ గౌడలకు తన బెస్ట్ విషెస్ అందజేశారు. ఈ సినిమా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుందని ప్రభాస్ తెలియజేశారు. ఇలా చిత్ర బృందానికి విషెస్ చెప్పిన అనంతరం ప్రభాస్, ప్రశాంత్ మధ్య ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఇక ఈ 418 మూవీ మొత్తం డార్క్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అనే సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి ప్రభాస్ మాట్లాడుతూ..ఈ సినిమాని ఎందుకు సమర్పిస్తున్నావ్? మీ సినిమాల్లాగే డార్క్ గా ఉంది. అందుకేనా? అంటూ ప్రశ్నించారు.
ప్రభాస్ ఇలా అడగడంతో వెంటనే ప్రశాంత్ నీల్ స్పందిస్తూ మరీ ఈ సినిమాని రాధే శ్యామ్(Radhe Shyam) సినిమా లాగా చేస్తే బాగుండదు కదా అన్న.. అంటూ పంచ్ వేయడంతో వెంటనే ప్రభాస్ నాకే పంచ్ వేస్తున్నావా? సలార్ 2 షూటింగ్ సమయంలో నీ పని చెప్తా అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు కొంతమంది ప్రశాంత్ వ్యవహార శైలి పై విమర్శిస్తున్నారు. ప్రభాస్ నటించిన రాదే శ్యామ్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలా డిజాస్టర్ సినిమాని గుర్తు చేస్తూ ప్రభాస్ పై పంచ్ వేయటానికి కొందరు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం డైనోసార్ ఫర్ 418 అంటూ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో ఇదివరకు సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక త్వరలోనే వీరి కాంబినేషన్లో సలార్ 2 సినిమా షూటింగ్ పనులను జరుపుకోబోతోంది. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ , స్పిరిట్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ పనులు పూర్తి కాగానే సలార్ 2 సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ సైతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: వెంకటేష్ తో కలసి స్టేజ్ పై అదిరిపోయే స్టెప్పులేసిన మల్లారెడ్డి కోడలు ప్రీతి!