E-Paper
Advertisement

లీకుల ఊబిలో ‘స్పిరిట్’.. సెట్ నుండి షాకింగ్ వీడియో వైరల్.. సందీప్ వంగాపై ఫ్యాన్స్ ఫైర్!

లీకుల ఊబిలో ‘స్పిరిట్’.. సెట్ నుండి షాకింగ్ వీడియో వైరల్.. సందీప్ వంగాపై ఫ్యాన్స్ ఫైర్!
Advertisement

Spirit Controversy: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమా చుట్టూ ఇప్పుడు నెట్టింట  నెగెటివిటీ, లీకుల బెడద మొదలైంది. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి హింసాత్మక చిత్రాలతో కేవలం హైప్ మాత్రమే క్రియేట్ చేయగలడనే ముద్ర పడ్డ  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్‌ను కూడా ఇలాంటి వివాదాస్పద యాక్షన్ క్రైమ్ డ్రామాతో పాడు చేస్తాడేమోననే భయాలు నిజమవుతున్నాయి. టాలీవుడ్‌లో ఎంతటి భారీ ప్రాజెక్ట్ అయినా సరే, సరైన ప్లానింగ్ లేకపోతే లీకుల వల్ల సినిమా క్రేజ్ ఎలా దెబ్బతింటుందో చెప్పడానికి ‘స్పిరిట్’ ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచేలా కనిపిస్తుంది.

 హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో, ముఖ్యంగా విమల్ థియేటర్ వంటి రద్దీ ప్రదేశాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సెట్ నుండి తాజాగా ఒక కీలకమైన వీడియో నెట్టింట లీకై వైరల్‌గా మారింది. అక్కడ ఏర్పాటు చేసిన నటీనటుల పర్సనల్  క్యారవాన్‌లలో సీనియర్ నటి నదియా పేరు స్పష్టంగా కనిపించడంతో, అసలు ఈ సినిమాలో కొత్తదనం ఏముందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

మళ్లీ పాత కాంబినేషన్లనే నమ్ముకుంటున్నారా 

దర్శకుడు సందీప్ వంగా కొత్తగా ఏమైనా ఆలోచిస్తాడేమో అనుకుంటే, మళ్లీ పాత కాంబినేషన్లనే నమ్ముకుంటూ రొటీన్ ఫార్ములా వైపు వెళ్తున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. గతంలో 2013 ఫిబ్రవరి 8న విడుదలై ఘనవిజయం సాధించిన కొరటాల శివ డైరెక్షన్ లోని ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ తల్లిగా నదియా నటించారు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయింది కదా అని, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే కాంబినేషన్‌ను రిపీట్ చేయడం టాలీవుడ్ రొటీన్ కమర్షియల్ మైండ్‌సెట్‌ను చూపిస్తోంది. జరీనా మొయిదు అనే అసలు పేరున్న నదియా, 80, 90వ దశకాల్లో మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి చాలా కాలం బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు రీఎంట్రీ ఇచ్చిన ‘మిర్చి’ సినిమా సెంటిమెంట్‌ను, అలాగే అదే 2013 సెప్టెంబర్ 27న వచ్చిన పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’లో సునంద అత్త పాత్రను ఇక్కడ మళ్లీ కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు  పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.

Advertisement

అత్తారింటికి దారేది చిత్రానికి నంది అవార్డు వచ్చినప్పటికీ, ఆమె కేవలం స్టైలిష్ మదర్ లేదా పవర్‌ఫుల్ అత్త పాత్రలకే పరిమితమైపోయారనే విమర్శ ఉంది. ఇప్పుడు ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ‘స్పిరిట్’ లాంటి హై-వోల్టేజ్ సినిమాలో కూడా ఆమెకు అలాంటి రొటీన్ కేరెక్టరే ఇస్తే, సినిమాలో కొత్తదనం ఏముంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి.

యానిమల్ తరహాలోనే విపరీతమైన రక్తపాతం

భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నప్పటికీ, లీకులను అరికట్టడంలో ఘోరంగా విఫలమయినట్టే కనిపిస్తుంది . బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా, వివేక్ ఒబెరాయ్‌ను విలన్‌గా పెట్టి కేవలం నార్త్ ఆడియన్స్‌ను ఆకర్షించే ప్లాన్ తప్ప, కథలో బలం లేదనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతోంది. హైదరాబాద్ షెడ్యూల్‌లో వివేక్ ఒబెరాయ్, ప్రభాస్‌లపై తీస్తున్న యాక్షన్ సీక్వెన్స్ లు కూడా యానిమల్ తరహాలోనే విపరీతమైన రక్తపాతం, నరకడాలతో నిండి ఉన్నాయని, ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను సినిమాకు దూరం చేస్తుందని హెచ్చరిస్తున్నాయి ట్రేడ్ సర్కిల్స్.

 అనుకున్న రేంజ్ లో డెలివర్ చేయడం కష్టమే

ఒకవైపు లీకైన క్యారవాన్ వీడియోలు మేకర్స్ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తుంటే, మరోవైపు సందీప్ వంగా మార్క్ వైలెన్స్ ఈ సినిమాను ఎలాంటి వివాదాల్లోకి నెడుతుందోననే ఆందోళన ప్రభాస్ అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పాత కాంబినేషన్లు, లీకవుతున్న అప్‌డేట్లు చూస్తుంటే స్పిరిట్ అనుకున్న రేంజ్ లో డెలివర్ చేయడం కష్టమేననే టాక్ గట్టిగా వినిపిస్తోంది.చూడాలి ఇంతలా నెగెటివిటీ ని చుట్టేసుకున్న ఈ స్పిరిట్ దాన్ని దాటుకుని ఎలా బయటికి వస్తుందో !

Also read :‘నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్’.. NBK111’ బర్త్‌డే సర్ప్రైజ్ రెడీ!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×