E-Paper
Advertisement

ఒకే ఓటీటీలో 15 సినిమాలు… తెలుగులో 8… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఒకే ఓటీటీలో 15 సినిమాలు… తెలుగులో 8… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

OTT Releases June 2026 : జూన్ మొదటి వారం ఓటీటీ ప్రియులకు సినిమా పండగగా మారింది. ఏకంగా 37 సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. యాక్షన్, హారర్, రొమాంటిక్ కామెడీ, డాక్యుమెంటరీలు… ఇలా అన్ని జోనర్లలో కంటెంట్ నిండిపోయింది. ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయాలనుకుంటున్న వాళ్లకు ఇది సూపర్ గుడ్ న్యూస్.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో హైలైట్స్

ఈ వారం అమెజాన్ ప్రైమ్ బాగా బిజీగా ఉంది. స్మాల్‌విల్లే సీజన్ 10 – సూపర్ హీరో మిస్టరీ డ్రామా జూన్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కార్మెని సెల్వం అనే తమిళ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా తెలుగు డబ్బింగ్ తో జూన్ 3న వస్తోంది. మేడిన్ ఇండియా: హిందీ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ ‘ఏ టైటాన్ స్టోరీ’ తెలుగు డబ్బింగ్ కూడా జూన్ 3న అందుబాటులో ఉంటుంది. క్లార్క్‌సన్ ఫార్మ్ సీజన్ 5, ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషీనా సీజన్ 4 వంటి ఇంగ్లీష్ సిరీస్‌ లు కూడా ఈ వారం వస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌ లో ఏముంది ?

Advertisement

నెట్‌ఫ్లిక్స్ కూడా ఫుల్ ఫామ్‌లో ఉంది. ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ‘మైఖేల్ జాక్సన్: ది వెర్డిక్ట్’ జూన్ 3న వస్తోంది. హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది వాచర్స్’, హిందీ క్రైమ్ డార్క్ కామెడీ ‘మా బెహన్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జూన్ 4న విడుదలవుతాయి. కొరియన్ స్కూల్ యాక్షన్ థ్రిల్లర్ ‘టీచ్ యూ ఏ లెసన్’ జూన్ 5న వస్తోంది. ఇందులో హారర్, క్రైమ్, కామెడీ అన్నీ ఉన్నాయి.

జియో హాట్‌స్టార్ స్పెషల్స్

జియో హాట్‌స్టార్ కొరియన్ డ్రామా లవర్స్‌కు గుడ్ న్యూస్ ఇచ్చింది. కొరియన్ మెడికల్ రొమాంటిక్ కామెడీ ‘డాక్టర్ ఆన్ ది ఎడ్జ్’ జూన్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2 ది రివేంజ్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జూన్ 4న వస్తోంది. లామెన్: బస్ రీవ్స్ వంటి ఇంగ్లీష్ సిరీస్‌లు కూడా ఉన్నాయి.

ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు

Advertisement

ZEE5లో మలయాళ స్పై యాక్షన్ డ్రామా ‘పేట్రియాట్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్, కన్నడ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘కేడీ ది డెవిల్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్, హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్రౌన్’ వంటి సినిమాలు జూన్ 5న వస్తున్నాయి. చౌపాల్‌లో పంజాబీ సైన్స్ ఫిక్షన్ కామెడీ ‘ఖడక్ సింగ్ చౌహాన్’ జూన్ 2న, హర్యాన్వీ క్రైమ్ థ్రిల్లర్ ‘కతల్ కే బాద్’ జూన్ 4న విడుదలవుతాయి.

Also Read : కంటైనర్ లో కాళ్ళూ చేతులు కట్టేసిన స్థితిలో దొరికే మహిళ… అంతు చిక్కని వింత మిస్టరీ

తెలుగు డబ్బింగ్ సినిమాలు

ఈ వారం తెలుగు ఆడియన్స్‌కు 8 సినిమాలు డబ్ అయి వచ్చాయి. కార్మెని సెల్వం, మేడిన్ ఇండియా, మా బెహన్, 29, ధురంధర్ 2, పేట్రియాట్, కేడీ ది డెవిల్, ది రైజ్ ఆఫ్ అశోక వంటి సినిమాలు తెలుగు డబ్బింగ్‌ తో అందుబాటులో ఉన్నాయి.కాబట్టి ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడానికి ఈ వీకెండ్ పర్ఫెక్ట్ టైమ్.

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×