Pragathi Weightlifting: ప్రగతి.. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో అమ్మ, అక్క, వదిన ,చెల్లి ఇలా ఏ పాత్రలు వేయాలన్న కేరాఫ్ గా నిలిచేది.అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రెండు దశాబ్దాల పాటు తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
అలాంటి ప్రగతి ఇప్పుడు రూట్ మార్చింది, సినిమాలను పక్కనపెట్టి ప్రస్తుతం వెయిట్ లిఫ్టింగ్ ని తన ఫ్యాషన్ గా మార్చుకుంది. అంతేకాదు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో వరుసగా పాల్గొంటూ షాక్ కి గురిచేస్తుంది.
నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న ప్రగతి
ఇదే క్రమంలో తాజాగా జరిగిన మరో నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న ప్రగతి తన ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎలా ఉన్న ప్రగతి ఇప్పుడు ఎలా మారిపోయింది అంటూ వాటిని తెగ వైరల్ చేసేస్తున్నారు మూవీ లవర్స్.ఇక ఈ ఫోటోలలో ప్రగతి భారీగా వెయిట్ లిఫ్టింగ్ చేయడం కనిపిస్తుండటంతో షాక్ అవుతున్నారు నెటిజన్లు.
Also read :కాజల్ కారవాన్‌లో జరిగిన ఘటన.. ఇన్నాళ్లకు బయటపెట్టిన హీరోయిన్!
ఒకప్పుడు ఎన్నో మంచి మంచి కుటుంబ కథ సినిమాల్లో కనిపించిన ప్రగతి ఇప్పుడు ప్రొఫెషనల్ కనిపించడం అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్ అని ప్రగతి ఈ ఫోటోలతో మరోసారి ప్రూవ్ చేసింది.
ఏ రంగంలోనైనా విజయం దక్కాల్సిందే
ఇక ప్రగతిని చూసి ఇంత డెడికేషన్ ఉంటే ఏ రంగంలోనైనా విజయం దక్కాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకొస్తున్నారు అభిమానులు .ఇక ప్రగతి గత కొన్నేళ్లుగా ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే .
ప్రతిరోజు గంటల తరబడి జిమ్లో వర్కౌట్ చేయడం, ట్రైనింగ్ పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయడం ఆమెకి చాలా కామన్ అయిపోయింది.ఇక వీటికి సంబంధించిన వర్కౌట్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెడుతూ యూత్ కి ఫిట్నెస్ పై మంచి అవగాహన కల్పిస్తుంది.ముఖ్యంగా ఆడవాళ్లు ఎక్సర్సైజులు చేయాలని మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోవాలని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
Also read :బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. ఇక కమ్‌బ్యాక్ కష్టమేనా..?
కెరియర్ విషయానికి వస్తే
ఇక ప్రగతి సినిమా కెరియర్ విషయానికి వస్తే నువ్వే నువ్వే, బొమ్మరిల్లు, దూకుడు, రేసుగుర్రం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కనిపించిన ప్రగతి ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లోను అదే విధంగా సక్సెస్ బాట పట్టడం విశేషం.