Aqib Javed On Pakistan Cricket: 2027 వన్డే వరల్డ్ కప్ ఎలాగైనా గెలవాలన్న కసితో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ ప్లేయర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, హిట్టింగ్ నేర్పించడం, పాడెల్ ప్రాక్టీస్ చేయించడం లాంటివి చేస్తోంది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఫిట్ గా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ లో కచ్చితంగా పాకిస్తాన్ అద్భుతంగా రాణిస్తుందని ఫ్యాన్స్ కూడా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆశలపై నీళ్లు జల్లారు మాజీ క్రికెటర్, సెలెక్టర్ ఆకిబ్ జావేద్. ఐసీసీ ర్యాంకింగ్స్ లో 7వ, 8వ స్థానాల్లో ఉన్న పాకిస్తాన్, 2027 వన్డే వరల్డ్ కప్ కొడుతుందనడం అత్యాశే అంటూ హేళన చేశారు ఆకిబ్ జావేద్. అలా చెప్పి, పాకిస్తాన్ ఫ్యాన్స్ ను మోసం చేయలేను అంటూ సెటైర్లు పేల్చారు. దీంతో ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: 6, 6, 6, 6 వైభవ్ సిక్సుల వర్షం..A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్, టీమిండియా విజయం
2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అన్ని జట్లు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల ఆశలపై నీళ్లు జల్లారు సెలెక్టర్ ఆకిబ్ జావేద్. ర్యాంకింగ్స్ లో ఏడూ, 8 స్థానాల్లో ఉన్న పాకిస్తాన్ 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడం అసాధ్యమన్నారు. గెలుస్తామని చెప్పడం కూడా అత్యాశ అవుతుందని హేళన చేస్తూ మాట్లాడారు. మా ఇంట్లో పట్టికలో కింది స్థానంలో ఉన్న జట్టు వరల్డ్ కప్ గెలిస్తే అదృష్టమే.. అంతకు మించి అద్భుతమే.. కానీ సుదీర్ఘ ఫార్మాట్ లో పాకిస్తాన్ రాణించడం కష్టమేనన్నారు. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 ODI World Cup tournament ) గెలిచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో కచ్చితంగా టీమిండియాను మాత్రం ఓడిస్తామని శపధం చేశారు మాజీ క్రికెటర్, సెలెక్టర్ ఆకిబ్ జావేద్.
వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ ( 2027 ODI World Cup tournament ) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య ఈసారి ఎక్కువ స్థాయిలో మ్యాచ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వరల్డ్ కప్ లో కొత్త ఫార్మాట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు మ్యాచులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలమైన జట్ల మధ్య ఎక్కువ మ్యాచ్ లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. వ్యూయ ర్షిప్ ఎక్కువగా రావాలన్న లక్ష్యంతో పసికూన జట్లను లైట్ తీసుకుంటున్నారు.
Also Read: ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్