E-Paper
Advertisement

Prabhas: కల్కి డైరెక్టర్ పై ప్రభాస్ ప్రశంసలు.. ట్రై చేస్తానన్న సందీప్ రెడ్డి!

Prabhas: కల్కి డైరెక్టర్ పై ప్రభాస్ ప్రశంసలు.. ట్రై చేస్తానన్న సందీప్ రెడ్డి!
Advertisement

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్(The Raja Saab) సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మరికొద్ది గంటలలో ఈ సినిమా ప్రీమియర్లు కూడా ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు హంగామా మామూలుగా లేదని చెప్పాలి. ఇప్పటికే థియేటర్ల వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం వరుస ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డితో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించిన సంగతి తెలిసిందే.

నాగ్ అశ్విన్ పై ప్రభాస్ ప్రశంసలు..

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ రాజా సాబ్ సినిమా గురించి అలాగే స్పిరిట్ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కల్కి సినిమా గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్య జరిగే సన్నివేశం సినిమాకి హైలైట్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇక ఈ సీన్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ కల్కి సినిమా చూడటం కోసం తన కజిన్స్ తో పాటు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లానని తెలిపారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు వాళ్లు నన్ను ఒక హీరోగా కూడా గుర్తించలేకపోయారని ప్రభాస్ తెలిపారు.

నేను హీరో అని మర్చిపోయారు..

Advertisement

సెకండ్ హాఫ్ లో అమితాబచ్చన్ గారు నన్ను కొట్టే సీన్లు రాగానే వాళ్ళందరూ పెద్ద ఎత్తున విజిల్స్ వేస్తూ గోల చేస్తున్నారు. అంటే అక్కడ నేను ఒక హీరో అన్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారని ప్రభాస్ తెలియజేశారు. ఇలా హీరోని కూడా మైమరిపించేలా సినిమా చేయడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుందని ఈ విషయంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారు అంటూ ప్రభాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ప్రభాస్ మాటలు విన్న సందీప్ రెడ్డి నేను కూడా ఇప్పుడు అలాగే చేయటానికి ట్రై చేస్తాను అంటూ తెలియజేశారు..

హర్రర్ కామెడీ నేపథ్యంలో..

Advertisement

ఇక సందీప్ రెడ్డి డైరెక్షన్లో ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించిన చిత్ర బృందం మేజర్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశారని తెలుస్తోంది . ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో స్పిరిట్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చారు.. ఈ సినిమా జనవరి 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు కూడా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. మరి రాజా సాబ్ తో ప్రభాస్ ఎలాంటి హిట్ కొట్టబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

Also Read: Sandeep Reddy Vanga : స్పిరిట్ పోస్టర్‌.. జిన్ బాటిల్‌లో విస్కీ.. లాజిక్ చెప్పిన సందీప్ రెడ్డి!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×