E-Paper
Advertisement

Maruthi: ఇండస్ట్రీలోకి రాకముందు రాజాసాబ్ డైరెక్టర్ ఏం చేసేవారో తెలుసా?

Maruthi: ఇండస్ట్రీలోకి రాకముందు రాజాసాబ్ డైరెక్టర్ ఏం చేసేవారో తెలుసా?
Advertisement

Maruthi: సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి రాకముందు మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ కెరియర్ ను కొనసాగిస్తూ ఉంటారు. అయితే సినిమాల మీద ఉన్న ఆసక్తి కారణంగా ఉద్యోగాలను వదిలి కూడా సినిమాల్లోకి వస్తూ ఉంటారు. అయితే ఆ సెలబ్రిటీలు తమ సినీ కెరియర్ లో సక్సెస్ సాధించిన తర్వాత వారు తమ జీవితంలో గతంలో ఏం చేశారు అనే విషయాలను అభిమానులు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జనవరి 9న సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ హీరోగా ది రాజాసాబ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శకుడు మారుతి. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటున్నారు. చిత్ర దర్శకుడు మారుతి. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీలోకి రాకముందు మారుతీ ఏం చేశారు? అనే విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు.

లోగో క్రియేటర్ గా మారిన మారుతి..

మారుతి మాట్లాడుతూ..” నా సినిమా ప్రయాణం మెగా ఫ్యామిలీతోనే మొదలైంది. నేను పవన్ కళ్యాణ్ జానీ సినిమాకు లోగో క్రియేట్ చేయడం టాలీవుడ్ లో నా మొదటి పని.. మమ్మల్ని ప్రోత్సహించినందుకు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు. అందుకే ఆయన నా లక్కీ చార్మ్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇండస్ట్రీ లోకి రాకముందు యానిమేటర్ గా పనిచేసిన ఈయన తన ఆదాయాన్ని పెంచుకోవడానికి నంబర్ ప్లేట్లు, సైన్ బోర్డులకు పెయింట్ కూడా చేసేవారట.

మారుతి దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా..

Advertisement

దర్శకుడిగా ఈరోజుల్లో అనే సినిమాతో 2012లో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా 10 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.అంతేకాదు 2012లో అత్యంత విజయవంతమైన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక కొంతకాలం తర్వాత అదే ఏడాది నవంబర్లో తన రెండవ చిత్రం బస్ స్టాప్ కూడా విడుదలై మంచి విజయం అందుకుంది. ఇక 2013లో.. మారుతి తన కెమెరామెన్ జే.ప్రభాకర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మారుతీ టాకీస్ పతాకం పై ప్రేమ కథా చిత్రంను రాసి నిర్మించాడు. 20 కోట్లు వసూలు రాబట్టి ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రొమాన్స్, మహేష్ విల్లా, లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్ వంటి చిత్రాలతో తన నిర్మాణ ప్రయాణాన్ని కూడా ఆయన కొనసాగించారు . అలా దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతూ మంచి పేరు దక్కించుకున్నారు.

also read:Andela Ravamidhi : ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న అందెల రవమిది.. ఎప్పుడు?ఎక్కడ చూడొచ్చంటే?

దర్శకుడిగా మారుతి సినిమాలు..

Advertisement

ఇకపోతే ఇప్పటివరకు దర్శకుడిగా బాబు బంగారం, కొత్తజంట, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు ప్రతిరోజు పండగే , మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మారుతి.. ఇప్పుడు ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×