E-Paper
Advertisement

Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ నుంచి బిగ్ అప్డేట్..

Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ నుంచి బిగ్ అప్డేట్..
Advertisement

Salaar 2: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. బాహుబలి  సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా సీక్వెల్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. త్వరలోనే ప్రభాస్ కల్కి, సలార్ సీక్వెల్ సినిమాల పనులలో బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం ఈయన హను రాఘవపూడి ఫాజీ, సందీప్ రెడ్డి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్ పనులతో పాటు కల్కి 2, సలార్ 2 పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

సలార్ 2 పై బిగ్ అప్డేట్…

ఇదిలా ఉండగా తాజాగా సలార్ 2 సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. జనవరి 25 లేదా 26 తేదీలలో సలార్ 2 సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించిన పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని, అధికారిక ప్రకటన అనంతరం రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఖాన్సార్ నగర నేపథ్యంలో..

Advertisement

ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన సందడి చేశారు. సలార్ సినిమా ఖాన్సార్ అనే కల్పిత నగరంలో మూడు తెగల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో మరొక స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ ఫ్రెండ్ గా కనిపించారు. అయితే రెండో భాగంలో ఈయన విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇలా మొదటి భాగంతోనే సీక్వెల్ సినిమాపై ప్రశాంత్ నీల్ భారీగా అంచనాలను పెంచేశారు.ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుందనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా హోంభలే ఫిలిమ్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

డ్రాగన్ పనులలో బిజీగా ప్రశాంత్ నీల్..

Advertisement

ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమా అనంతరం మరో పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ తో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాతో పాటు సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.  ప్రభాస్ ఫౌజీ షూటింగ్ మరి కొద్ది రోజులలో పూర్తి అవుతుందని, అనంతరం సలార్ 2 పనులలో బిజీ కానున్నారని తెలుస్తుంది. ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

Also Read: HC on Ticket Price: చిరు సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టు సీరియస్.. ఇకపై ధరలు పెంపునకు కొత్త కండీషన్

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×