E-Paper
Advertisement

Fire Accident: తృటిలో తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు దిగిన కొద్దిసేటికే అగ్నికి ఆహుతైన ప్రైవేట్ బస్సు

Fire Accident: తృటిలో తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు దిగిన కొద్దిసేటికే అగ్నికి ఆహుతైన ప్రైవేట్ బస్సు
Advertisement

Fire Accident: నేటి కాలంలో ప్రయాణం అంటేనే ఒక గండంలా మారిపోయింది. రోజురోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ప్రయాణం అంటే..  గమ్యస్థానం చేరి బస్సు దిగే వరకు గుండెను చేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇటీవల ఒక ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన ఇందుకు తాజా ఉదాహరణ అనే చెప్పవచ్చు.  అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ ముందే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ.. అదే మంటలు ప్రయాణ సమయంలో గనుక సంభవించి ఉంటే పరిస్థితి ఎంత భీభత్సంగా ఉండేదో ఊహించడానికే భయం వేస్తుంది.

Advertisement

ముబైంలో జరిత్యాల జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. జగిత్యాల నుంచి సుమారు 35 మంది ప్రయాణికులతో ముంబైకి వెళ్లిన వీనస్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికులను గమ్యస్థానంలో సురక్షితంగా దింపిన అనంతరం పార్కింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. పార్కింగ్ సమయంలో బస్సు నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే బయటకు రావడంతో పాటు స్థానికులకు సమాచారం అందించాడు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో కొద్ది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంటలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సు కాలిబూడిదగా మారింది.

Advertisement

అదృష్టవశాత్తు ప్రమాదం జరిగే సమయానికి ప్రయాణికులంతా బస్సు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఈ ఘటన తీవ్ర విషాదానికి దారి తీసే అవకాశం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అయితే బస్సు పూర్తిగా కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. స్థానికుల ఫిర్యాదులో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. షార్ట సర్క్యూట్ ఎలా జరిగిందనే అంశంపై సాంకేతికి నిపుణులతో పరిశీలన జరపనున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×