E-Paper
Advertisement

HC on Ticket Price: చిరు సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టు సీరియస్.. ఇకపై ధరలు పెంపునకు కొత్త కండీషన్

HC on Ticket Price: చిరు సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టు సీరియస్.. ఇకపై ధరలు పెంపునకు కొత్త కండీషన్
Advertisement

HC on Ticket Price: ఇటీవల కాలంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి టికెట్ ధరలు పెంచడానికి అనుమతులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో టికెట్ ధరలు పెంచడానికి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ తెలంగాణలో మాత్రం సినిమా టికెట్ల ధరల విషయంలో హైకోర్టు ఎప్పటికప్పుడు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది. తాజాగా మరోసారి టికెట్ ధరలపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ల వివాదం పై హోం శాఖ సెక్రెటరీకి, సివి ఆనంద్ కు కంటెంప్ట్ నోటీసులను జారీ చేసింది.

చిరంజీవి సినిమా టికెట్ ధరలపై హైకోర్టు సీరియస్..

హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై సుమోటో కోర్ట్ ధిక్కరణ కేసును హైకోర్టు నమోదు చేస్తూ నోటీసులను జారీ చేసింది. ఇక ఇటీవల విడుదలైన మన శంకర్ వరప్రసాద్ గారు(MSVPG) సినిమా టికెట్ ధరల పెంపుకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కోసం ఎనిమిదవ తేదీనే టికెట్ ధరలను పెంచారని అయితే ఈ విషయాన్ని జిపి కోర్టు దృష్టికి తీసుకు రాలేదని న్యాయవాది విజయ్ గోపాల్ పేర్కొన్నారు.

90 రోజుల ముందే నిర్ణయించుకోవాలి..

Advertisement

ఇలా ఈ సినిమాకు టికెట్లు రేట్లు పెంచడంతో సీరియస్ అయిన హైకోర్టు విజయ్ గోపాల్ వేసిన పిటీషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని జిపిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. ఇలా సినిమా టికెట్ ధరల గురించి హైకోర్టు సరికొత్త నిబంధనలను కూడా అమలు చేయబోతోంది. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరలు పెంచాలని నిర్ణయిస్తే కనుక టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు సినిమా విడుదలకు 90 రోజుల ముందు జారీ చేయాలని హోం శాఖకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇలా కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఏ సినిమాకైనా టికెట్టు రేట్లు పెంచాలి అనుకుంటే అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేయడానికి వీలు లేకుండా 90 రోజుల ముందే అనుమతి తీసుకుని జీవో విడుదల చేయాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

సంక్రాంతి సినిమాలకు పెరిగిన టికెట్ ధరలు..

Advertisement

ఇటీవల కాలంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలవుతున్న సినిమాల టికెట్ ధరలకు తెలంగాణలో ఆటంకాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి పలు సందర్భాలలో తనకు తెలియకుండానే టికెట్ల రేట్లను పెంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎవరూ కూడా టికెట్ల రేట్లు పెంచమని కోరుతూ తమ వద్దకు రావద్దని సూచించారు. ఇలా సినిమాటోగ్రఫీ మంత్రి చెప్పినప్పటికీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ సినిమాలకు టికెట్ ధరలు పెరగడంతో మరోసారి హైకోర్టు జోక్యం చేసుకొని పలు నిబంధనలను విధించింది.

Also Read; Atlee – Priya Mohan: మరోసారి తండ్రి కాబోతున్న డైరెక్టర్ అట్లీ.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రియా మోహన్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×