E-Paper
Advertisement

Vande Bharat sleeper train: వందేభారత్ స్లీపర్ లోపల ఇలా ఉంటుందా? వైరల్ వీడియో మీరూ చూసేయండి!

Vande Bharat sleeper train: వందేభారత్ స్లీపర్ లోపల ఇలా ఉంటుందా? వైరల్ వీడియో మీరూ చూసేయండి!
Advertisement

దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ.. పశ్చిమ బెంగాల్ లోని మాల్దాలో ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రైలు చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. సుదూర రాత్రి ప్రయాణాలకు అనుగుణంగా తయారు చేసిన ఈ రైల్లో ప్రయాణీకులకు అందించే సౌకర్యాల గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు పగటి పూట ప్రయాణాలకు అనుకూలంగా ఉన్న వందేభారత్ రైలు ఇప్పుడు స్లీపర్ బెర్త్‌ లతో రాత్రిపూట ప్రయాణాల కోసం అందుబాటులోకి వచ్చింది. తొలిసారి హౌరా-కామాఖ్య రూట్ లో సర్వీసులను అందిస్తోంది. వేగవంతమైన ప్రయాణం, అప్‌ గ్రేడ్ చేసిన కోచ్‌లు, మరింత ప్రీమియం ఆన్‌బోర్డ్ ఎక్స్ పీరియెన్స్ తో సాంప్రదాయ రాత్రి రైళ్ల నుంచి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

వైరల్ అవుతున్న సీపర్ రైలు లోపలి వీడియోలు

వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించి బోలెడు వీడియో వైరల్ అవుతున్నాయి. 1AC కంపార్ట్‌ మెంట్ ఎలా ఉందనే విషయాన్ని కంటెంట్ క్రియేటర్ కైలాషి యష్ బాజ్‌పాయ్ వివరించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఏకంగా 20 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది.  వైరల్ వీడియోలో బెర్త్‌లకు సంబంధించిన లేఅవుట్, డోర్ లాకింగ్ మెకానిజం, ముడుచుకునే విండో షేడ్, పర్సనల్ ఎయిర్ సర్క్యులేషన్ వెంట్‌లు మంచి లైటింగ్ వచ్చేలా చేస్తుంది. కంపార్ట్‌ మెంట్ డోర్ స్పెషల్ ఫీచర్ల గురించి వివరించారు. డోర్ పైభాగానికి సమీపంలో ఉన్న చిన్న కిటికీ స్మార్ట్ గ్లాస్ తో ఉంటుంది. బటన్‌ను క్లిక్ చేయగానే బయటి వ్యూ కనిపిస్తుంది. ఇది ప్రయాణీకులకు ప్రైవసీతో పాటు భద్రతను కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఈ రైళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రయాణీకులను రిక్వెస్టు చేస్తున్నా” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇప్పుడు ఈ రైలును ప్రయాణీకులు సరిగ్గా ఉపయోగించుకోవాలి. అది వారి బాధ్యత” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “పిల్లలతో ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. అందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “గత కొన్ని సంవత్సరాలలో కేంద్రం ప్రభుత్వం చేసిన బెస్ట్ పనులలో ఇది ఒకటి” అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు.

Advertisement

అటు వందే భారత్ స్లీపర్ గురించి మరో వైరల్ వీడియో ఆన్‌ లైన్‌ లో హల్‌ చల్ చేస్తోంది. ఇందులో ఒక ప్రయాణీకుడు రైల్లో చెత్తను వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తినేసిన ఐస్ క్రీమ్ కప్పులను, స్పూన్లను డస్ట్ బిన్ లలో కూడా కంపార్ట్ మెంట్ లో పడేయపడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. డస్ట్‌ బిన్‌లను ఉపయోగించకపోవడం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందన్నాడు. అత్యాధునిక సౌకర్యాలతో వచ్చిన ఈ రైలును చెత్త బుట్టలా మార్చాకూడదన్నాడు. రైల్లోని డస్ట్ బిన్ లను ఉపయోగించాలని సూచించాడు.

Read Also:  రసగుల్లా To బసంతి పులావ్.. వందేభారత్ స్లీపర్ ఫుడ్స్ భలే ఉన్నాయే!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×