BigTV English
Advertisement

Spirit: స్పీడ్ పెంచిన ప్రభాస్, స్పిరిట్ షూటింగ్ అప్పుడే మొదలైపోతుంది

Spirit: స్పీడ్ పెంచిన ప్రభాస్, స్పిరిట్ షూటింగ్ అప్పుడే మొదలైపోతుంది

Spirit: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ప్రస్తుతం ఏ సినిమా చూసినా కూడా అది పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుంది. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రస్తుతం ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీలోని మోస్ట్ బిజియస్ట్ యాక్టర్ ప్రభాస్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటికి దాదాపు 5 ప్రాజెక్టులు అనౌన్స్ చేసేసాడు. కొన్ని సినిమాలకు ఇంకా సీక్వెల్ చేయాల్సి ఉంది.


మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో సినిమా చేస్తున్నాడు. అందుకే చాలామంది అభిమానులు ఈ సినిమా మీద క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

స్పిరిట్ సినిమా షూటింగ్ అప్పుడే 

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా యానిమల్ సినిమా తరహాలోనే స్పిరిట్ సినిమా వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియో చూసి చాలామందికి మంచి హైప్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే మామూలుగా ఉండదు అనే క్లారిటీ చాలామందికి ఉంది. అయితే ప్రభాస్ ను ఈసారి ఏ రేంజ్ లో చూపిస్తాడా అనే క్యూరియాసిటీ కూడా మొదలైంది.


స్పిరిట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ నవంబర్ 8వ తారీకు నుంచి మొదలుకానుంది. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారు. సందీప్ రెడ్డి వంగ చాలా ఫాస్ట్ గా సినిమాలు తీస్తూ ఉంటారు. అయితే చాలా లాంగ్వేజెస్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కొంత మేరకు టైం తీసుకోవడం జరుగుతుంది.

కాంప్రమైజ్ అవ్వడు 

సినిమాలు విషయంలో చెక్కుతూ ఉంటాడు అని ఎస్ ఎస్ రాజమౌళిని జక్కన్న అని పిలుస్తుంటారు. అయితే సందీప్ రెడ్డి వంగా కూడా ఒక సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ఒక సినిమాను వేరే భాషలోకి డబ్బింగ్ చేసినా కూడా అది డబ్బింగ్ సినిమాల కాకుండా ఒరిజినల్ ఫీల్ వచ్చేలా ట్రై చేస్తుంటాడు.

యానిమల్ సినిమాను కూడా దాదాపు 100 రోజుల్లో పూర్తి చేశాడు సందీప్. ఆ సెటప్ తో వంద రోజుల్లో సినిమాను పూర్తి చేయడం అనేది మామూలు విషయం కాదు. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకుంది. మరి స్పిరిట్ విషయంలో ఏం చేస్తాడో వేచి చూడాలి.

Also Read: Mass jathara trailer delay: మళ్లీ ట్రైలర్ లేటు, ఈ దర్శక నిర్మాతలు ఎప్పటికీ మారుతారు?

Related News

Film Chamber : సేవ్ ఫిలిం ఛాంబర్… హైదరాబాద్ లో నిర్మాతలు నినాదాలు.. అసలేం జరుగుతుంది?

Kingdom : కింగ్డమ్ సినిమాలో మురుగన్ క్యారెక్టర్ వదులుకున్న తెలుగు నటుడు

Dil Raju: విజయ్ దేవరకొండను సైడ్ చేసిన దిల్ రాజు.. రంగంలోకి కుర్ర హీరో?

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ వచ్చేసింది, బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది

Mass jathara trailer delay: మళ్లీ ట్రైలర్ లేటు, ఈ దర్శక నిర్మాతలు ఎప్పటికీ మారుతారు?

Thiruveer : ప్రభాస్ సినిమాలలో అవకాశం మిస్ చేసుకున్న యంగ్ హీరో తిరువీర్ 

Sachin Chandwade: సూసైడ్ చేసుకున్న యంగ్ హీరో.. ఆలస్యంగా వెలుగులోకి?

Big Stories

×