Mass jathara trailer delay: ఒకప్పుడు ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకొచ్చేది సినిమాకి సంబంధించిన ఆల్బమ్. ఇప్పుడైతే అందరూ యూట్యూబ్లో సాంగ్స్ వింటున్నారు కానీ ఒకప్పుడు క్యాసెట్స్ రూపంలో ఆడియో విడుదలయ్యేది. ఆ ఆడియో సాంగ్స్ విని సినిమా మీద విపరీతమైన నమ్మకాలు పెట్టుకుండేవారు అప్పటి ప్రేక్షకులు. అయితే సోషల్ మీడియా బాగా పెరిగిన కొద్దీ ప్రస్తుతం ఆడియో క్యాసెట్లు మాయమైపోయాయి. అన్ని సాంగ్స్ కూడా యూట్యూబ్లో వినడం మొదలుపెట్టారు.
ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆడియో ఫంక్షన్ జరిగేవి. కానీ ఇప్పుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయి. సినిమాకి కొన్ని రోజుల ముందు ఈవెంట్ పెట్టి ట్రైలర్ రిలీజ్ చేయడం వంటి ప్లానింగ్ వేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఇలాంటి ఈవెంట్స్ లేనప్పుడు ట్రైలర్ ను డైరెక్ట్ గా రిలీజ్ చేస్తారు. ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం కామన్ గా జరిగేది. అయితే చెప్పిన టైంకి ఒక్కసారి కూడా చాలామంది దర్శక నిర్మాతలు అప్డేట్ ఇవ్వడం లేదు.
మళ్లీ ట్రైలర్ లేటు
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా మాస్ జాతర. సామజ వరగమన సినిమాకి రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు రవితేజ. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నేడు 7 గంటల మూడు నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ట్రైలర్ విడుదల కాలేదు. మళ్లీ ట్రైలర్ లేట్ అయింది.
అయితే ట్రైలర్ రిలీజ్ కావడం లేట్ అవ్వడం అనేది ఇది మొదటిసారి కాదు. ఎప్పుడూ కూడా ఇదే తంతు. చెప్పిన టైంకి ఒక్కసారి కూడా ట్రైలర్ గానీ టీజర్ గాని విడుదల అవ్వదు. ఆ టైం వచ్చిన తర్వాత కొత్త టైం అనౌన్స్ చేయడం. లేకపోతే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పడం అలవాటుగా మారిపోయింది. అయితే ఈ విషయంలో దర్శక నిర్మాతలు ఎప్పుడు మారుతారని ప్రేక్షకులు కూడా ఆలోచనలో పడిపోయారు. వీళ్ళు చెప్పిన టైమింగ్స్ కు అప్డేట్స్ రాకపోవడంతో తీవ్రంగా నిరాశకు గురవుతున్నారు.
Also Read: Thiruveer : ప్రభాస్ సినిమాలలో అవకాశం మిస్ చేసుకున్న యంగ్ హీరో తిరువీర్