Fact Check: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేలల్లో రోజు వారీ ఆదాయాన్ని పొందే సులభమైన పెట్టుబడి స్కీమ్ ను ప్రోత్సహిస్తున్నారని సోషల్ మీడియాలో ఓ ఏఐ వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వీడియోను డిజిటల్‌గా మార్పు చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలిపింది.
కేంద్ర ఆర్థిక మంత్రి లేదా ప్రభుత్వం అలాంటి ఏ పథకాన్ని ప్రారంభించలేదని పేర్కొంది. ఈ వీడియోలు తేదీ, లోగో ఇతర వివరాలు ఫ్యాక్ట్ చెక్ లో పూర్తిగా ఫేక్ అని తేలిందని తెలిపింది. ఇలాంటి వీడియో లింక్ లపై క్లిక్ చేసే ముందు ప్రజలు పూర్తి విషయాలను పరిశీలించాలని పీఐబీ సూచించింది.
24 గంటల్లో రూ. 60,000, నెలకు రూ. 10 లక్షలు సంపాదించే పెట్టుబడి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమోట్ చేస్తు్న్నట్లు ఓ ఏఐ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో గురించి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సోమవారం నెటిజన్లను హెచ్చరించింది.
“ఫేస్‌బుక్‌లోని ఒక వీడియోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజువారీ ఆదాయాన్ని సులభతరం చేసే పెట్టుబడి పథకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తప్పుగా చూపించారు. కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించలేదు” అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇలాంటి గెట్ రిచ్ ట్రాప్‌లలో ప్రజలు పడొద్దని సూచించింది. ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా విచారించాలని కోరింది.
ఏఐ టెక్నాలజీ అభివృద్ధి ఇలాంటి ఫేక్ వీడియోలను సులభంగా చేస్తున్నారని, ఈ తరహా వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తు్న్నారు. ఏఐ వీడియోలను గుర్తించేందుకు.. వీడియోలో స్పీకర్ పెదవుల కదలిక లేదా వారు మాట్లాడే తీరు గమనించాలని తెలిపింది. అలాగే వీడియోలో తేదీ, నేపథ్యం, లోగో సరిపోల్చుకోవాలని తెలిపింది.
💥 Earn ₹60,000 in 24 hours & ₹10 Lakhs a month!
🚨Sounds tempting❓ 💸 Think Again‼️
A video on Facebook falsely shows Union Finance Minister @nsitharaman promoting an 'investment program' that promises easy daily income.#PIBFactCheck ✅
❌ FAKE ALERT!
👉The video is… pic.twitter.com/QsUkFkrYYW— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2025
భారత ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు ఎప్పుడూ .gov.in తో ముగుస్తాయని పీఐబీ తెలిపింది. ఈ లింక్ పై క్లిక్ చేయండి అని వచ్చే వీడియోలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారుల ఫొటోలను ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించే ఫేక్ వీడియోలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. స్టాక్స్, షేర్ మార్కెట్ లో పెట్టుబడులపై వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Also Read: PM Kisan 21st Installment: పీఎం కిసాన్ పై బిగ్ అప్డేట్.. 21వ విడత డబ్బులు పడేది అప్పుడే