E-Paper
Advertisement

The Raja Saab Pre Release: సర్ ప్రైజ్  ఇచ్చిన ది రాజా సాబ్ టీమ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే..

The Raja Saab Pre Release: సర్ ప్రైజ్  ఇచ్చిన ది రాజా సాబ్ టీమ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే..
Advertisement

The Raja Saab Pre Release: ప్రభాస్ హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab). కామెడీ హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమాని డిసెంబర్ ఐదవ తేదీ విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

రాజే యువరాజే ప్రోమో..

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా ఈ రెండు పాటలు సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఇటీవల రాజే యువరాజే అంటూ మూడో పాటకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఇలా ఊహించని విధంగా ది రాజా సాబ్ టీం నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు అయితే తాజాగా చిత్ర బృందం ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ తెలియజేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event)హైదరాబాద్ లో ఉండదు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి.

హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్..

Advertisement

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను యుఎస్ లో నిర్వహిస్తారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలు నిజం కాదని, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నట్టు చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో నిర్వహించబోతున్నట్లు అధికారకంగా వెల్లడించారు అయితే ఎక్కడ ఈ వేడుక జరగబోతుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇలా చిత్ర బృందం ఈ పోస్టర్ విడుదల చేయడంతో పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఒకేసారి రేపు ఈ పోస్టర్ విడుదల చేస్తే సరిపోయేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా జనవరి 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో డిసెంబర్ 27వ తేదీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడం కరెక్టేనా అంటూ మరి కొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది ఎవరు అతిథులుగా రాబోతున్నారు? ప్రభాస్ హాజరవుతారా? లేదా? అనే సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే .ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Dandora Movie: శివాజీ మాటలతో సినిమాని జడ్జ్ చెయ్యొద్దు.. డైరెక్టర్ ఆవేదన!

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×