E-Paper
Advertisement

Eng – Aus 4th Test: చెలరేగిన బౌలర్లు.. ఒక్కరోజే 20 వికెట్లు డౌన్

Eng – Aus 4th Test: చెలరేగిన బౌలర్లు.. ఒక్కరోజే 20 వికెట్లు డౌన్
Advertisement

Eng – Aus 4th Test: యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం రోజు 4వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ సాంప్రదాయంగా ప్రతి ఏడాది జరిగే బాక్సింగ్ డే టెస్ట్. అంటే క్రిస్మస్ మనసటి రోజున ఆడే ప్రత్యేక టెస్ట్ మ్యాచ్. ఆస్ట్రేలియన్ టెస్ట్ క్రికెట్ క్యాలెండర్ లో ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ గా గుర్తింపు పొందింది. ఇక ఈ నాలుగవ టెస్ట్ మ్యాచ్ లోకి ఆస్ట్రేలియా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది.

Also Read: Vijay hazare trophy: రింకూ సింగ్ అద్భుత సెంచరీ.. సెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేసినట్టేనా?

Advertisement

ఇప్పటికే మొదటి మూడు టెస్టులను గెలుచుకున్న ఆస్ట్రేలియా.. 3 – 0 తో సిరీస్ ని ముందుగానే సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇంకో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ట్రోఫీ ఆస్ట్రేలియా ఖాతాలోకి చేరింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ కి ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా అతడికి విశ్రాంతి ఇచ్చారు. ఇక మూడవ టెస్ట్ కి దూరమైన స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇతడే ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్:

Advertisement

ఈ నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 45.2 ఓవర్లలో 152 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మైఖేల్ నెసర్ {35}, ఉస్మాన్ ఖవాజా {29}, అలెక్స్ క్యారీ {20} టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. 45 పరుగులు ఇచ్చిన టంగ్.. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. అలాగే గస్ అట్కిన్ సన్ 2, బెన్ స్టోక్స్, బ్రైడెన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 29.5 ఓవర్లలో 110 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ {41}, అట్కిన్ సన్ {28}, బెన్ స్టోక్స్ {16}, మినహా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మైకెల్ నెసర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్కాట్ బోల్యాండ్ 3, మిచెల్ స్టార్క్ 2, కామెరున్ గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు.

 

రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియా 42 పరుగుల స్వల్ప ఆదిక్యంతో రెండవ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్ లో.. వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది. ఈ ఓవర్ ని పూర్తిగా ఎదుర్కొన్న స్కాట్ బోలాండ్ ఒక ఫోర్ సాయంతో నాలుగు పరుగులు చేశాడు. ఈ నాలుగో టెస్ట్ లో మొత్తంగా బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. ఇరుజట్ల పేసర్లు చెలరేగడంతో మొదటి రోజే ఏకంగా 20 వికెట్లు నేలకూలాయి.

Also Read: India’s ODI Squad: న్యూజిలాండ్ తో వ‌న్డేలు.. టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న మ‌రింత ఆల‌స్యం.. అయ్య‌ర్ కు కెప్టెన్సీ !

ఇక ఈ చివరి రెండు టెస్టులను కూడా గెలిచి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఆస్ట్రేలియా. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఈ చివరి రెండు మ్యాచ్ లలో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. అటు సిరీస్ కోల్పోయి, ఇటు మద్యం సేవించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చివరి రెండు టెస్టులలో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తున్నారు ఇంగ్లాండ్ క్రికెటర్లు.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×