E-Paper
Advertisement

Dandora Movie: శివాజీ మాటలతో సినిమాని జడ్జ్ చెయ్యొద్దు.. డైరెక్టర్ ఆవేదన!

Dandora Movie: శివాజీ మాటలతో సినిమాని జడ్జ్ చెయ్యొద్దు.. డైరెక్టర్ ఆవేదన!
Advertisement

Dondora Movie: దండోరా గత మూడు రోజులుగా ఈ సినిమా పేరు మారుమోగుతుంది. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు శివాజీ (Sivaji)చేసిన వ్యాఖ్యల కారణంగా దండోరా (Dandora)సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమా వేడుకలో భాగంగా శివాజీ మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడిన తీరు పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈయన బహిరంగ వేదికగా మహిళల గురించి అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిన నేపథ్యంలో ఎంతోమంది తీవ్ర స్థాయిలో విమర్శలకు కురిపిస్తున్నారు.

దుమారం రేపిన శివాజీ కామెంట్స్..

ఇక మరి కొంతమంది శివాజీ వ్యాఖ్యలకు మద్దతు తెలియజేస్తున్నారు శివాజీ చెప్పిన దాంట్లో తప్పు లేదు కానీ ఆయన చెప్పిన విధానం తప్పు ఉంది అంటూ ఈయనకు మద్దతుగా నిలుస్తున్నారు. సినిమా విడుదలకు ముందు శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా పట్ల తీవ్రమైన ప్రభావం చూపించాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దండోరా సినిమా డైరెక్టర్ మురళి కాంత్(Murali Kanth) వేదికపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సినిమా చూడకుండా జడ్జ్ చెయ్యొద్దు..

Advertisement

ఈ సందర్భంగా దర్శకుడు మురళి కాంత్ మాట్లాడుతూ.. దండోరా సినిమా కోసం గత మూడు సంవత్సరాలుగా తాను ఎంతగానో కష్టపడుతున్నానని తెలిపారు. నా కష్టానికి తగ్గ ఫలితం స్క్రీన్ పై కనిపించింది అయితే ఈ సినిమా వేడుకలో భాగంగా రెండు మూడు మాటలు దొర్లితే ఆ మాటలకు అనుగుణంగా సినిమాని ఎవరు దయచేసి జడ్జ్ చేయొద్దని వేడుకొన్నారు. సినిమా చూడటం కోసం థియేటర్ కి వచ్చి ఆ తర్వాత సినిమా పట్ల మీ అభిప్రాయాలను తెలియచేయండి కానీ శివాజీ గారి మాటల ఆధారంగా సినిమాని అంచనా వేయొద్దు అంటూ ఈయన కోరారు.

దండోరాకు భారీ ప్రమోషన్…

Advertisement

ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో భాగంగా నటుడు శివాజీ కూడా పాల్గొన్నారు అయితే ఈయనకు వివాదం గురించి ప్రశ్నలు తలెత్తినప్పటికీ వాటికి సమాధానం దాటి వేస్తూ కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శివాజీ తో పాటు నవదీప్, నందు, బిందు మాధవి వంటి తదితరులు కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ విడుదల అయినప్పటికీ మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరి కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా శివాజీ వ్యాఖ్యల కారణంగా దండోరా సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ లభించిందినే చెప్పాలి.

Also Read: Actress Madhavi Latha: అనసూయకు మద్దతుగా మాధవీలత.. మగాళ్లు ధోతీ వేసుకోవాలంటూ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×