BigTV English

Dude Movie : ఓవర్సీస్ లో ‘డ్యూడ్’ సాలిడ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Dude Movie : ఓవర్సీస్ లో ‘డ్యూడ్’ సాలిడ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?
Advertisement

Dude Movie : తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, ప్రేమలో బ్యూటీ మమిత బైజు నటించిన లేటెస్ట్ చిత్రం డ్యూడ్.. ఈ సినిమాకు కీర్తీశ్వరన్ దర్శకత్వం చేయగా… మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ వై ప్రొడ్యూస్ చేశారు. సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు.. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నిన్న థియేటర్లోకి వచ్చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి షో నుంచి దూసుకుపోతున్న ఈ షో కలెక్షన్స్ కూడా అంతే రేంజ్ లో ఉండటం విశేషం. ఇండియాలో మాత్రమే కాదు అటు ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అక్కడ వసూల్ అయిన కలెక్షన్ల వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం..


ఓవర్సీస్ లో దున్నెస్తున్న ‘డ్యూడ్’..

తెలుగు, తమిళ్ లో డ్రాగన్, లవ్ టుడే మూవీతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం డ్యూడ్.. ఈ మూవీ నుంచి రిలీజ్ కి ముందు వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. థియేటర్లోకి వచ్చిన మొదటిరోజు డీసెంట్ టాక్ ని సొంతం చేసుకుంది. రెండో రోజు కూడా అదే రేంజ్ లో ఓపెనింగ్స్ రావడం విశేషం. కేవలం ఇండియాలో మాత్రమే కాదు అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ని రిజిస్టర్ చేస్తుంది.. మొదటి రోజు ఈ మూవీ 2 లక్షల డాలర్లను వసూళ్లు చేసింది. ఇక ఈ వీకెండు ఈ మూవీకి మంచి కలెక్షన్లు దక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : తండ్రి లేకుండానే బాలయ్య పెళ్లి చేసుకున్నాడా?.. ఇన్నాళ్లు బయటపడ్డ నిజం..


ఇండియాలో కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..? 

డ్రాగన్ మూవీతో ప్రదీప్ రంగనాథన్ పాపులర్ స్టార్ అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. దానికి తోడు ప్రేమలు సినిమాతో యూత్ క్రష్ గా మారిన మమిత బైజు క్రేజ్ కూడా మూవీకి ప్లస్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తమిళంలో రూ. 6.75 కోట్లు, తెలుగులో రూ. 3.25 కోట్లు వసూల్ చేసిందని టాక్.. మొత్తానికి దాదాపు 18 కోట్ల కలెక్షన్లను అందుకుందని సమాచారం. మరి ఇండియాలో ఎన్ని కోట్లు వసూల్ చేసిందో డ్యూడ్ యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హిట్ మూవీ పడిందని తెలుస్తుంది. డిఫరెంట్ స్టోరీ కావడంతో యూత్ ఎక్కువగా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారని పబ్లిక్ రెస్పాన్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ వీకెండు ఇండియాలో కూడా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఫైనల్ గా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో తెలియాల్సి ఉంది.

 

Related News

Rashmika Mandanna: మొదటిసారి నిశ్చితార్థం పై స్పందించిన రష్మిక.. భలే సమాధానం ఇచ్చిందిగా!

Baahubali Re Release: 8 ఏళ్ల క్రితమే బాహుబలి రీ రిలీజ్‌ ప్లాన్.. జక్కన్నకు ఐడియా ఇచ్చింది ఇతనే

Ustad Bhagat Singh : 12 సంవత్సరాల నుంచి ఉన్న కసి బయటపడుతుంది, నిర్మాత ఉస్తాద్ అప్డేట్స్

Bandla Ganesh: బండ్లన్న ఇంట్లో నైట్ పార్టీ… మెగాస్టార్‌తో సహా ఇండస్ట్రీ అంతా అక్కడే

Diwali Movies: బాక్సాఫీసు వద్ద పేలని సినిమాలు.. ఈ దీపావళికి నో ఎంటర్‌టైన్‌మెంట్‌!

Tom – Ana de: అంతరిక్షంలో పెళ్ళన్నారు.. 9 నెలలకే బోర్ కొట్టేసిందా టామ్!

Naresh in K Ramp : నరేష్‌ పాత్రను తీసుకునే ముందు డైరెక్టర్ ఆలోచించాల్సింది

Sukumar -Ramcharan: RC 17 షూటింగ్ పై బిగ్ అప్డేట్.. మరింత ఆలస్యంగా పుష్ప 3!

Big Stories

×