Nandamuri Balakrishna : నందమూరి నటసింహం హీరో బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీరియల్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలయ్య తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించారు. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు. ఇదిలా ఉండగా బాలయ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కన్న తండ్రి లేకుండానే బాలయ్య బాబు పెళ్లి చేసుకున్నారంటూ ఓ న్యూస్ ప్రచారంలో ఉంది. ఎందుకు ఎన్టీఆర్ పెళ్లికి రాలేదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
కన్న తల్లిదండ్రులు లేకుండా ఏ కొడుకు పెళ్లి చేసుకోరు.. అవును అది నిజమే. అనుకోని పరిస్థితుల్లో లేకపోతే ఇష్టమైన అమ్మాయి నో లేదా అబ్బాయినో పెళ్లి చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. కానీ కొడుకంటే అమితమైన ప్రేమ ఉన్న ఎన్టీఆర్ బాలయ్య పెళ్లికి రాకపోవడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణ కూడా బాలయ్య పెళ్లిలో లేరని ఇన్నాళ్లకు వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందుకు కారణం కూడా ఉందట. ఎన్టీఆర్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉండేవాడు అన్న విషయం తెలిసిందే.. ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆ పెళ్ళికి హాజరు కాలేకపోయారని సమాచారం. ప్రజలంటే ప్రాణం ఇచ్చే ఎన్టీఆర్ వారికోసం ఏదైనా చేస్తారని ఈ వార్తతో మరోసారి నిరూపణ అయ్యింది.
Also Read : ‘ఇంటింటి రామాయణం ‘ కమల్ రియల్ లైఫ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్..?
బాలయ్య హీరోగా చేస్తున్న సమయంలోనే పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఎన్టీఆర్ రామోజీరావు ఇద్దరు సన్నిహితంగా ఉండేవారు. ఓసారి ఎన్టీఆర్కు రామోజీరావు ఇంట్లోని అమ్మాయి టీ ఇచ్చిందట.. ఆమె అనుకువ ఆయనకు బాగా నచ్చింది. దాంతో ఆమె వివరాల గురించి రామారావుని ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు. వసుందర దేవి అప్పటికే బాగా ఆస్తి ఉన్నా ఇంటి బిడ్డ.. వసుంధర దేవి అంటే రామోజీరావు, ఆయన సతీమణికి చాలా ఇష్టమట. అందుకే తరచూ వీరి ఇంట్లోనే ఆమె ఉండేదట.. ఎన్టీఆర్ బాలకృష్ణకు ఈ అమ్మాయిని చేస్తే బాగుంటుందని అనుకుంటున్నానని అనడంతో రామోజీరావు పెళ్లి పెద్దగా మారి వీరిద్దరు పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించారు. ఆ తర్వాత పెళ్లి సమయంలో ఎన్టీఆర్ హరికృష్ణ దగ్గర లేకపోవడంతో రామోజీ రావే ఆ పెళ్లి పనులను తన మీద వేసుకొని బాలయ్య, వసుంధర ల వివాహాన్ని అనుకున్న దానికన్నా గ్రాండ్ గా జరిపించాడు. ఇది అసలు మ్యాటర్ అన్నమాట.. బాలయ్య వసుంధర దేవి లకు ముగ్గురు సంతానం. ఇక బాలయ్య ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 మూవీలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.