IND VS AUS : టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. రెండు జట్ల మధ్య సిరీస్ నేపథ్యంలో గిల్ ఆధ్వర్యంలోని జట్టు ఆస్ట్రేలియా కు వెళ్ళింది. ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య 3 వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. అయితే, ఈ వన్డే సిరీస్ భారత కాలమానం ప్రకారం ఉదయమే ప్రారంభం కానుంది. 9 గంటల సమయంలోనే ప్రతి వన్డే మ్యాచ్ కూడా జరగనుంది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది. ఉదయం 9 గంటల సమయంలో ఈ వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. అంటే మధ్యాహ్నం రెండు గంటల సమయం వరకు పూర్తవుతుంది. ఇక టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే తో పాటు టి20 సిరీస్ జియో హాట్ స్టార్ లో తిలకించవచ్చు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో కూడా లైవ్ ప్రసారాలు రానున్నాయి. జియో కొంతమందికి ఉచితంగా ఈ ప్రసారాలు అందిస్తుంటే.. మరికొందరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నెల 19వ తేదీన అంటే రేపు మొదటి వన్డే జరగనుండగా 23వ తేదీన రెండో వన్డే అడిలైడ్ వేదికగా నిర్వహిస్తారు. మూడవ వన్డే అక్టోబర్ 25వ తేదీన సిడ్ని వేదికగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 29వ తేదీ నుంచి రెండు జట్ల మధ్య టి20 సిరీస్ ప్రారంభమవుతుంది. అలా మొత్తం ఐదు టి20 లో జరగనున్నాయి. నవంబర్ 8వ తేదీ వరకు సిరీస్ మొత్తం ముగుస్తుంది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే రికార్డులు ఒకసారి పరిశీలిస్తే.. ఇందులో కంగారులుపై చేయి సాధించారు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 152 వన్డే మ్యాచ్ లు జరిగాయి. ఇందులో కేవలం 58 మ్యాచ్ ల్లోనే టీమ్ ఇండియా విజయం సాధించింది. 84 వన్డే మ్యాచ్ లలో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టడం గమనార్హం. అంటే ఆస్ట్రేలియా ఆదిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి టీమ్ ఇండియా మాత్రం చాలా బలంగా ఉందని చెబుతున్నారు. ధోని కెప్టెన్సీ తర్వాత జట్టు స్వరూపాలు మారిపోయాయి. విదేశాలకు కూడా టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఆస్ట్రేలియా పైన కూడా ఈసారి విజయం సాధిస్తుందని అందరూ అంటున్నారు.
టీమిండియా అంచనా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్