E-Paper
Advertisement

కోనసీమలో తీవ్ర విషాదం.. పంట కాల్వలో మునిగి ముగ్గురు మృతి!

కోనసీమలో తీవ్ర విషాదం.. పంట కాల్వలో మునిగి ముగ్గురు మృతి!
Advertisement

Konaseema Canal: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సాగిన పయనంలో ఒక్కసారిగా కాల్వ నీళ్లు ముగ్గురి ప్రాణాలను బలిగొనడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు పిన్న వయస్కులు మృతిచెందడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ప్రమాదవశాత్తు తొలుత పావని (14) అనే చిన్నారి పంట కాల్వ నీటిలోకి దిగి మునిగి పోయింది. ఆమెను కాపాడాలనే ఆరాటంతో వెంటనే రంజిత్‌ (15), వీరేంద్ర (19) కూడా నీటిలోకి దిగారు. అయితే కాల్వలో ప్రవాహం, నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ ఒక్కసారిగా గల్లంతయ్యారు.

Advertisement

సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కాపాడాలన్న ప్రయత్నంలో ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. మృతులు పసలపూడి, పడమర కండ్రిగ గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు.

Also Read: NTA లో ఊచకోత.. 47 మంది అధికారుల తొలగింపు.. క్రిమినల్ కేసులు నమోదు!

Related News

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!

ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో రమా నందనా విచారణ.. ఏం జరిగిందంటే?

జాబ్స్ అడిగితే కేసులా బాబు? ఇదేం దారుణం: జగన్ ఫైర్

బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను

ఏపీకి భారీ వర్ష గండం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిపై పోస్టులా.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×