E-Paper
Advertisement

ప్రశ్నించడం మా హక్కు.. నాగబాబుకు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్..

ప్రశ్నించడం మా హక్కు.. నాగబాబుకు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్..
Advertisement

prakash raj vs naga-babu: ప్రకాష్ రాజ్ ..ఇండియన్ మూవీ లవర్స్ కి కొత్తగా పరిచయం అక్కర్లేని పేరిది. అయితే సినీ రంగంలో తనదైన వెర్సటైల్ యాక్టింగ్ తో ఎన్నో జాతీయ అవార్డులని కొల్లగొట్టిన ఈ గ్రేట్ యాక్టర్ గత కొన్నేళ్లుగా సెన్సేషన్ పొలిటికల్ కామెంట్స్ వదులుతూ మీడియాలో హైలెట్ అవుతున్న సంగతి తెల్సిందే.ముఖ్యంగా సొసైటీలో జరిగే పరిణామాలపై ,పొలిటికల్ లీడర్స్ పై ప్రకాష్ రాజ్ వదిలే కామెంట్స్ నెట్టింట మంటలు పుట్టిస్తుంటాయ్.ఇదే క్రమంలో మెగా బ్రదర్ నాగ బాబు వదిలిన పోస్ట్ కి ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్ ఇపుడు మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.

నాయకుడికి అన్నీ తెలుసంటూ నాగబాబు పోస్ట్ 

విషయంలోకి వెళ్తే ..నాగ బాబు తన అసలు విషయంలోకి వెళితే, నాగబాబు పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ ఒక నాయకుడికి అన్నీ తెలుసని, ఆయన మాటే శాసనమని తన అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేసుకొచ్చాడు.పైగా కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా, మౌనంగా నాయకుడి మాటను అనుసరించాలని ఆ పోస్ట్‌లో రిక్వెస్ట్ చేశాడు. అయితే బ్లైండ్‌గా లీడర్‌ను ఫాలో అవ్వాలనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పోస్ట్ నెటిజన్లలో రకరకాల డిబెట్లకి తెరతీసింది.

Advertisement

నాగబాబుని ఏకిపారేసిన ప్రకాష్ రాజ్  

ఇదే క్రమంలో నాగబాబు కామెంట్స్ పై మండిపడుతూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు ప్రకాశ్ రాజ్. మీ సందేహాలను పక్కనపెట్టి, మౌనంగా నాయకుడిని అనుసరించండి అనడంలో అసలు మీ ఉద్దేశం ఏంటని ఏకిపారేశాడు.తామేమీ మౌనంగా బతకడానికి జంతువులం కాదంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఇలాంటి బెదిరింపు ధోరణి పోస్టులు వద్దని నాగబాబుకు సూచిస్తూ, ప్రశ్నించడం అనేది పౌరుడిగా తమకున్న ప్రాథమిక హక్కని గుర్తుచేశారు. ఏ నాయకుడైనా, లేదా నేనే లీడర్‌ని అనుకునే వ్యక్తైనా సరే, ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుందని కుండ బద్దలు కొట్టేశాడు.

Advertisement

ఈ ట్వీట్స్ వార్ ఎక్కడికి దారి తీస్తుందో !

ఇక ప్రకాశ్ రాజ్ ఇలా ఈ ట్వీట్ చేశాడో లేదో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇటు జనసేన అభిమానులు, అటు ప్రకాశ్ రాజ్ మద్దతుదారులు సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి విమర్శల,ప్రతి విమర్శల యుద్దానికి తెర తీశారు. అయితే ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. ఈ వ్యవహారంలోకి ఎవరూ ఊహించని విధంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ను దైవంగా భావించే బండ్ల గణేశ్, ప్రకాశ్ రాజ్ పోస్ట్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై మండిపడ్డారు. దీంతో ఈ వివాదం కేవలం నాగబాబు, ప్రకాశ్ రాజ్‌ల మధ్యే కాకుండా బండ్ల గణేశ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్‌గా మారిపోయింది.దీంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు సెలెబ్రిటీస్ ఒకరికి కౌంటర్ నెట్టింట కామెంట్స్ వదలడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రాజకీయాల్లో లాయల్టీ అనేది ఎంత ముఖ్యమో,ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుక కూడా అంతే ముఖ్యమనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. నాగబాబు తన తమ్ముడిపై ఉన్న నమ్మకంతో ఆ పోస్ట్ పెట్టినప్పటికీ, అది ఇన్ డైరెక్ట్ గా ప్రజల భావప్రకటన స్వేచ్ఛను తొక్కిపెట్టేలా ఉందనేది ప్రకాశ్ రాజ్ ఆర్గ్యుమెంట్.మరోవైపు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని శంకించే హక్కు ఎవరికీ లేదంటూ జనసేన శ్రేణులు ప్రకాశ్ రాజ్‌ను టార్గెట్ చేస్తున్నాయి. చూడాలి మరి ఒకరిపై ఒకరు వేసుకుంటున్న ఈ ట్వీట్స్ వార్ ఎక్కడికి దారి తీస్తుందో !

also read :ఆ లవ్ అఫైర్స్ నాకొద్దు అంటున్న క్రేజీ హీరోయిన్…ఆ ఆలోచనే లేదంటూ క్లియర్ కట్ వార్నింగ్!

Related News

హంస లాంటి సోయగాలతో మైమరపిస్తున్న నిధి అగర్వాల్!

ఒకే సినిమాలో 12 పాత్రలు.. కమల్ హాసన్‌ను మించిపోయిన ప్రియాంక చోప్రా!

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

Big Stories

Advertisement
×