E-Paper
Advertisement

నీళ్లు లేక నరకయాతన.. సహారా ఎడారిలో 49 మంది దుర్మరణం

నీళ్లు లేక నరకయాతన.. సహారా ఎడారిలో 49 మంది దుర్మరణం

Sahara Tragedy: ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మంచినీళ్లు దొరక్క ఏకంగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియా దేశ సరిహద్దుల్లో జరిగిన ఈ దిగ్భ్రాంతికర ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించి వేస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజరియా దేశానికి చెందిన కొందరు పౌరులు.. తమ బంధువులతో ముస్లిం పండుగ ‘ఈద్ అల్-అధా’ను జరుపుకునేందుకు సరిహద్దు దేశమైన మాలికి ట్రక్కులో వెళ్లారు. అక్కడ వేడుకలు ముగించుకొని వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

మాలి నుంచి నైజర్ కు వీరి ట్రక్ రిటర్న్ కాగా.. అసమాకా అనే సరిహద్దు ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలో వాహనం ఆగిపోయింది. దీంతో ట్రక్కును రిపేర్ చేసేందుకు డ్రైవర్ యత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీనికి తోడు వెంట తెచ్చుకున్న నీరు, ఆహారం అయిపోవడంతో.. నడి ఎడారిలో దిక్కుతోచని స్థితిలోకి వారంతా వెళ్లిపోయారు. కనుచూపు మేర ఎవరు లేకపోవడంతో సాయం చేసే వారే కరువయ్యారు.

అయితే ట్రక్కులోని ఇద్దరు వ్యక్తులు ధైర్యం చేసి ఎడారి నుంచి బయలు దేరారు. వారు దాదాపు 50 కి.మీ నడిచి నీటి వనరులను కనుగొన్నారు. అక్కడ దాహం తీర్చుకొని 80 కి.మీ దూరంలోని అసమాకాకు చేరుకున్నారు. అక్కడి స్థానిక అధికారులను కలుసుకొని జరిగినదంతా వారికి వివరించారు. దీంతో స్థానిక అధికారులు అఫ్రమత్తమై.. ట్రక్కు ఆగిపోయిన ప్రాంతానికి వెళ్లారు. ఘటనాస్థలికి వెళ్లిన అధికారులకు హృదయ విదారక దృశ్యాలు దర్శనమిచ్చాయి.

Also Read: ఐఫోన్ Vs ఆండ్రాయిడ్.. ప్రైవసీ విషయంలో ఏది సేఫ్? కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు!

ట్రక్కు చుట్టూ పదుల సంఖ్యలో మృతదేహాలు వారికి కనిపించాయి. విపరీతమైన వేడి, ఉక్కపోతకు తోడు.. నీరు, ఆహారం లేక వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు నైజర్ అధికారులు వెల్లడించారు. ఈ ట్రక్కు.. నైజీరియా సరిహద్దుకు 300 కి.మీ దూరంలో ఉన్న మాలి దేశ పట్టణం తల్హండెంక్ కు వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎడారిలో చాలా రోజులు ప్రయాణించడంతో ట్రక్కులో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు. అయితే ఈ మార్గాన్ని సాధారణంగా పౌరులు ఎవరు వినియోగించరని అధికారులు తెలిపారు. ఆఫ్రికా నుంచి యూరప్ కు వలస వెళ్లేవారు మాత్రమే ట్రక్ వచ్చిన మార్గాన్ని వినియోగిస్తారని తెలిపారు. గతంలోనూ చాలా మంది ఆ మార్గంలో ప్రయాణించి ఆకలిదప్పులతో ప్రాణాలు విడిచినట్లు స్థానికులు పేర్కొన్నారు.

Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు పొడగింపు.. ఎప్పటివరకు అంటే?

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

Big Stories

×