E-Paper
Advertisement

ఖమ్మం నగరానికి నయా లుక్.. సిద్ధమైన తీగల వంతెన.. తుది మెరుగులు చూసారా..!

ఖమ్మం నగరానికి నయా లుక్.. సిద్ధమైన తీగల వంతెన.. తుది మెరుగులు చూసారా..!
Advertisement

Cable Bridge: స్వేచ్చ బ్యూరో: తీగల వంతెన తుది మెరుగులు దిద్దుకుంటోంది. మానేరు నది పరవళ్ల మధ్యన ఇపుడు అందమైన తీగల వంతెన ప్రారంభానికి సిద్ధం అయింది. ఖమ్మం నగరంలో మున్నేరు పై జలగంనగర్-కా ల్వొడ్డు మధ్య 1.25కి.మీ. పొడవున ఈ వంతెన నిర్మాణం గత రెండేళ్లుగా సాగుతోంది. ఇందుకోసం రేవంత్‌రెడ్డి సర్కారు రూ.180 కోట్ల వ్యయ అంచనాలతో చేపట్టిన మున్నేరు తీగలవంతెన నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఖమ్మం నగరంలోని మున్నేరు పై నిర్మించే కాల్వొడ్డు తీగలవంతెన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగు తున్నాయి.

మున్నేరు పాత బ్రిడ్జి..

నిత్యం వేలాదిగా ప్రయాణాలు సాగిస్తున్న మున్నేరు పాత బ్రిడ్జి స్థానం నుండే ఇంతకాలం కోదాడ – ఖమ్మం మధ్య న ఇంకా సూర్యాపేట ఖమ్మం జిల్లాల మధ్య కూడా శిధిలావస్ధకు చేరిన ఇదే వంతెన గుండానే రాకపోకలు సాగిస్తున్నారు. ఖమ్మం మున్నేరు నది పై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ఇక్కడి పలు ప్రాజెక్టులకు అవసరమైన సేవల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా సూచించారు. నిర్ణీత గడుపులోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్మాణ పనులు వేగంగా విస్తరిస్తున్నారు.

Advertisement

Also read: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!

యుద్ధ ప్రాతిపదికన చర్యలు..

ఇంకా మున్నేరు నది పై ఉన్న రాజీవ్ గృహకల్ప, రంగనాయక గుట్ట, ప్రకాష్ నగర్ చెక్ డ్యాం లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా బైపాస్ రోడ్డు నుంచి తీగల వంతెన వరకు ఎడమ, కుడి వైపుల మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు పూర్తిచేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయనతో పాటు మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్&బీ ఎస్ఇ యాకుబ్ లు పనుల్ని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Also read: Vamsi Goud: నల్గొండ జిల్లా గీత కార్మికుడి కొడుకు.. తెలంగాణ తరపున ఢిల్లీలో సంచలనం..!

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×