E-Paper
Advertisement

ఎగురుతున్న ఫ్లైట్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్… తేడా కొట్టదు కదా?

ఎగురుతున్న ఫ్లైట్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్… తేడా కొట్టదు కదా?
Advertisement

Jr.NTR -Neel : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు ఈ టైటిల్ కాకుండా మరొక టైటిల్ ఉందని త్వరలోనే ఈ టైటిల్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు చిత్ర బృందం తెలియచేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ కేవలం 40 శాతం మాత్రమే షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఎగురుతున్న ఫ్లైట్ లో యాక్షన్ సీక్వెన్స్..

ఇక ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పలు యాక్షన్ సన్ని వేషాలకు సంబంధించిన సీన్లు సోషల్ మీడియాలో కూడా గతంలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని ప్రశాంత్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్ ఎగురుతున్న ఫ్లైట్ లో ఉండే విధంగా డైరెక్టర్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఫ్లైట్ లో యాక్షన్ సీక్వెన్స్.. వర్కౌట్ అయ్యేనా?

Advertisement

మూవీ ఇంటర్వెల్ కి సంబంధించిన ఈ యాక్షన్ ఎపిసోడ్ హీరో విలన్ మధ్య కొనసాగుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా లేనివిధంగా మొదటి సారి ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్ పెట్టబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఈ వార్తలపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు . అసలు గాల్లో ఎగురుతున్న ఫ్లైట్ లో యాక్షన్ ఎపిసోడ్ ఏంటి.. వర్కౌట్ అయితే పర్లేదు కానీ లేదంటే మొదటికే మోసం వస్తుంది అంటూ ఈ విషయంపై వారి అభిప్రాయాలను తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్..

Advertisement

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సినిమాపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి కుష్బూ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ వంటి తదితరులు కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు అధికారక ప్రకటన మాత్రం వెలబడలేదు.

Also Read: బాలీవుడ్ కు దూరంగా నాగచైతన్య..లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ కారణమా?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×