Jay Shah On Ball tampering: పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ 2026 ( Pakistan Super League 2026 ) సందర్భంగా బాల్ టాంపరింగ్ ( Ball tampering) తెరపైకి వచ్చింది. ఆదివారం రోజున లాహోర్ ఖలందర్స్ vs కరాచీ కింగ్స్ ( Lahore Qalandars vs Karachi Kings) మధ్య కీలక మ్యాచ్ జరగగా… ఇందులో బాల్ టాంపరింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. లాహోర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది ( Shaheen Shah Afridi), హరిస్ రవూఫ్, ఫఖర్ జమాన్ ముగ్గురు కూడా ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారానికి పాల్పడ్డారు. అయితే వీళ్ళు బాల్ టాంపరింగ్ చేసినట్లు రుజువు కావడంతో, కచ్చితంగా యాక్షన్ ఉంటుందని ప్రచారం జోరు అందుకుంది. అయితే దీనిపై తాజాగా ఐసీసీ బాస్ జై షా ( Jay Shah On Ball tampering) కూడా స్పందించినట్లు తెలుస్తోంది. బాల్ టాంపరింగ్ కు పాల్పడిన ముగ్గురు నిందితులపై కచ్చితంగా ఆంక్షలు ఉంటాయని జై షా హెచ్చరించినట్లు తెలుస్తోంది. తన కాళ్లు పట్టుకున్న వదిలేది లేదని, తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని జై షా ( Jay Shah) వెల్లడించినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.
Also Read: MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెరపైకి ఫిక్సింగ్ ఆరోపణలు, KKRపై ముంబై విజయం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో బాల్ టాంపరింగ్ జరిగిన వ్యవహారంపై ఐసీసీ బాస్ జై షా స్పందించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ బాల్ టాంపరింగ్ కు పాల్పడిన షాహీన్ అఫ్రిది, హరిస్ రవూఫ్ అలాగే ఫఖర్ జమాన్ లపై బ్యాన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రూల్స్ ప్రకారం బాల్ టాంపరింగ్ చేయడం అనేది పెద్ద నేరం. బంతి ఆకారం మార్చడమే ఈ బాల్ టాంపరింగ్. అయితే ఈ వ్యవహారం ఎవరు చేసినా కూడా శిక్ష విధించేందుకు ఐసీసీ ఛైర్మన్ జై షా సీరియస్ గా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా బాల్ టాంపరింగ్ జరిగిన వ్యవహారంపై మాజీ కెప్టెన్ ఫఖర్ జమామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పై బురద జల్లెందుదుకు ఇండియన్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో బాల్ టాంపరింగ్ అస్సలు జరగలేదన్నారు. కావాలని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్ పై సంతకం చేసే ప్రయత్నం జమాన్ చేశాడని.. కానీ దాన్ని తప్పుగా చిత్రీకరించి బాల్ టాంపరింగ్ అంటూ ఆరోపిస్తున్నారని ఇంజమాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసేందుకు ఇండియన్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటారని.. ఇప్పుడు అదే పని చేస్తున్నారని మండిపడ్డారు.
https://www.facebook.com/photo?fbid=966167006324042&set=a.808612632079481