AI Banking Security: మీరు ఒక ఎఐ ఏజెంట్ కు నా ఖర్చులన్నీ చెక్ చేసి డబ్బు ఎలా సేవ్ చేయాలో చెప్పు అని చెప్పారు. అది మీ బ్యాంక్ అకౌంట్ లోకి లాగిన్ అయింది. మీ ట్రాన్సాక్షన్లు చూసింది. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత మీకు తెలియకుండానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తే. మీరు చెప్పని పనులు కూడా చేయడం మొదలు పెడితే, ఇదేదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ కాదు. అమెరికాలోని పెద్ద బ్యాంకులు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల గురించే టెన్షన్ పడుతున్నాయని యక్సియోస్ ఒక రిపోర్ట్ లో చెప్పింది. అసలు ఈ ఏఐ ఏజెంట్లు ఏంటి? బ్యాంకులు వీటిని చూసి ఎందుకు భయపడుతున్నాయి? మన బ్యాంక్ అకౌంట్ కు కూడా ఇలాంటి ముప్పు ఉంటుందా అన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం.
మనకు నార్మల్ గా చార్ట్ బాట్ తెలుసు కదా. అంటే మనం నా అకౌంట్ బాలెన్స్ ఎంత అని అడిగితే అవి నెంబర్ చూపిస్తాయి. కానీ ఏఐ ఏజెంట్ అనేది కేవలం ఆన్సర్ చెప్పడంతో ఆగిపోదు. మన తరపున పనులు కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏఐ ఏజెంట్ కి నా బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేయి, క్రెడిట్ కార్డు బిల్లు గడువు ముగిస్తుంటే ఆటోమేటిక్ గా పే చేయి, మిగిలిన డబ్బుతో మంచి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయి, అని కమాండ్ ఇచ్చారు అనుకుందాం. మీ పని ఈజీ చేయడానికి మీరు మీ బ్యాంక్ యూసర్ నేమ్ పాస్వర్డ్ ను ఆ ఏజెంట్ కి ఇస్తారు. అది మీ ప్లేస్ లోకి అకౌంట్ లోకి లాగిన్ అయి పనులన్నీ పూర్తి చేస్తుంది. ఇది వినడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది కదా. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం ఒక అకౌంట్ లోకి కేవలం ఆ మనిషి మాత్రమే లాగిన్ అవ్వాలి. యూసర్ తన పాస్వర్డ్ ను థర్డ్ పార్టీ ఏఐ సాఫ్ట్వేర్ కు ఇవ్వడం బ్యాంకు సెక్యూరిటీ రూల్స్ కు పూర్తిగా విరుద్ధం. మీరు పర్మిషన్ ఇచ్చినా సరే అది అనాథరైజ్డ్ యక్సెస్ కిందకే వస్తుంది. సరే యూసరే పర్మిషన్ ఇచ్చాడు కదా బ్యాంకులకు ఎందుకు భయం అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే రెండు సమస్యలు ఉన్నాయి.
ప్రధానంగా రెండు సమస్యలు..
మొదటి సమస్య ఏది మనిషో ఏది రోబోటో గుర్తుపట్టలేకపోవడం. ఓ పక్క ఏఐ టెక్నాలజీ వేగంగా పెరిగిపోతుంది. బ్యాంకు సిస్టం లోకి లాగిన్ అవుతున్నది నిజమైన మనిషా లేక ఒక ఏఐ బాట అనేది కనిపెట్టడం బ్యాంకులకు తలనొప్పిగా మారింది. ఇక రెండో సమస్య ఏఐ ఏజెంట్ రోగ్గా మారడం. అంటే ఏఐ ఏజెంట్ కొన్నిసార్లు తనకు ఇచ్చిన పరిధిని దాటి ప్రవర్తిస్తుంది. కొన్ని ఏఐ ఏజెంట్లు కస్టమర్ కేర్ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల యూసర్ చెప్పని పనులను కూడా సొంతంగా చేయడానికి ట్రై చేస్తున్నాయని కొన్ని బ్యాంకులు గుర్తించాయి. ఒకవేళ మీరు ఏఐ ఏజెంట్ కి షాపింగ్ చేసే లేదా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసే పర్మిషన్ ఇచ్చారు అనుకోండి. అది కోడింగ్ లో ఏదైనా పొరపాటు వల్ల లేదా హ్యాకింగ్ వల్ల మీ అకౌంట్ లోని డబ్బును తప్పుగా వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తే దాని బాధ్యత ఎవరిది అనేదే ఇక్కడ క్వశ్చన్. అందుకే బ్యాంకులు ఇప్పుడు భయపడుతున్నాయి. ఈ రిస్క్ ఏ స్థాయికి చేరిందంటే బ్యాంకులు ఇప్పుడు తమ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ నిబంధనలను వేగంగా మార్చేస్తున్నాయి. మోర్గాన్ స్టాన్లీ అయితే థర్డ్ పార్టీ ఏఐ ఏజెంట్లు తమ ప్లాట్ఫామ్ ను యక్సెస్ చేయకుండా నేరుగా బ్లాక్ చేయడం ప్రారంభించింది. జేబి మోర్గాన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా సిటీ బ్యాంక్ కూడా ఏజెంట్ల యక్సెస్ పై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం..
బ్యాంక్ కస్టమర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ యూసర్ నేమ్, పాస్వర్డ్లను ఎవరికీ లేదా ఏ థర్డ్ పార్టీ టూల్స్ కి ఇవ్వకూడదని తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. బ్యాంకులు సాధారణంగా క్వికెన్ లేదా మింట్ వంటి బడ్జెటింగ్ యప్ లకు రీడ్ ఓన్లీ యక్సెస్ ఇస్తాయి. అంటే ఆ యాప్ లు మీ అకౌంట్ ఇన్ఫో ని స్టేట్మెంట్ ని మాత్రమే చూడగలవు కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేవు, డిపాజిట్ చేయలేవు. కానీ ప్రస్తుత ఏజెంట్లు కేవలం చూడడంతో ఆగకుండా యక్షన్స్ తీసుకోవడానికి ట్రై చేయడమే ఇప్పుడు సమస్యకు కారణం. ఈ పరిస్థితిని మీకు మరింత ఈజీగా అర్థమయ్యాల చెప్పాలంటే ఫర్ సపోజ మీరు మీ ఇంటిని క్లీన్ చేయమని పని మనిషికి కీస్ ఇచ్చి వెళ్ళారనుకోండి. పద్ధతిగా క్లీన్ చేస్తే పర్లేదు. కానీ దొరికిందే ఛాన్స్ కదా అని ఇంట్లోని వస్తువులతో ఉడాయించేస్తే లేక ఇంటినే పూర్తిగా దోచేస్తే ఇదే భయం ఇప్పుడు బ్యాంకులకు ఉంది. ఏఐ బాడ్స్ టెక్నాలజీ పరంగా రోజు రోజుకు అప్డేట్ అవుతున్నాయి. సొంతంగా ఆలోచించి యూసర్ కు తెలియకుండా ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే బాధ్యత ఎవరిది అనేది బ్యాంకుల క్వశ్చన్. అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఏఐ ని పూర్తిగా బ్యాన్ చేయడమైనా అంటే అది ఇంపాసిబుల్ అని బ్యాంకింగ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
Also Read: అమెరికాలో లక్ష డాలర్ల జీతం.. ఇండియాలో ఎంత సంపాదనతో సమానం?
ఎఐ ఏజెంట్లను ఆపడం సొల్యూషన్ కాదు..
ఎందుకంటే రాబోయే రోజుల్లో కస్టమర్లు ఖచ్చితంగా ఏఐ ఏజెంట్లను వాడడానికే ఇష్టపడతారు కాబట్టి ఏఐ ఏజెంట్లను పూర్తిగా అడ్డుకోవడం సొల్యూషన్ కాదు. కానీ వాటిని సేఫ్ గా యూస్ చేసేలా చేయడమే అసలైన సవాల్. చివరిగా ఒక మాట ఏఐ మన
పనులను ఎంత సులువు చేసినా మన అత్యంత సున్నితమైన బ్యాంకింగ్ వివరాలు పాస్వర్డ్లను ఏఐ టూల్స్ కి ఇవ్వడం ప్రస్తుతానికి అయితే చాలా ప్రమాదకరమని తెలుస్తోంది. పని ఈజీగా అయిపోతుంది అని యక్సెస్ ఇస్తే ఎప్పుడఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి.