E-Paper

ఆ బూతు బొమ్మలని తక్షణమే తొలగించండి.. టెక్ దిగ్గజాలపై కోర్టుకెక్కిన బాలీవుడ్ బ్యూటీ

ఆ బూతు బొమ్మలని తక్షణమే తొలగించండి.. టెక్ దిగ్గజాలపై కోర్టుకెక్కిన బాలీవుడ్ బ్యూటీ
Advertisement

Deepfake Case: డీప్ ఫేక్ ….ఈ పదం ఇపుడు సెలెబ్రెటీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తుంది.ముఖ్యంగా హీరోయిన్స్ పాలిట ఇదొక బూతం లా తయారైంది.ఈ టెక్నాలజీతో వస్తున్న ఫోటోలని, నిజమైన ఫోటోలని పక్క పక్కన పెడితే ఏది నిజమో ఏది ఫేకో తెలుసుకోలేనంతగా మార్పింగ్ చేస్తున్నారంటే ఈ టెక్నాలజీ ఎంతలా అడ్వాన్స్డ్ గా డిజైన్ చేయబడిందో అర్థం అవుతుంది.

ఇపుడు ఇదే డీప్ ఫేక్ నా పరువుకి భంగం కలిగిస్తుందని ఇలా డీప్ ఫేక్ చేస్తున్న వారిపై అలాగే నెట్టింట్లో తనపై చేసిన వేలాది మార్ఫింగ్ ఫోటోలని అరికట్టాలంటూ బాంబే హైకోర్టు తలుపు తట్టింది ప్రీతి జింతా.ఇందులో సర్క్యులేట్ అవుతున్న మార్ఫింగ్ లింక్ ,ఫేక్ వీడియోలని తొలగించేలంటూ  గూగుల్, మెటా వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలతో పాటు డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లను కూడా ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చింది ఈ బాలీవుడ్ వెటరన్ బ్యూటీ.

ఇంటర్ నెట్ నుండి కంప్లీట్ గా తొలగించాలి 

Advertisement

విచ్చలవిడిగా పెరిగిన టెక్నాలజీతో అసలు ఏది నిజమో, ఏది అబద్దమో గుర్తించడం కామన్ మ్యాన్ కే కాకుండా, సెర్చ్ ఇంజిన్లకి కూడా కష్టంగా మారిపోయిందని ,ఇలా వ్యక్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ మార్ఫింగ్ కంటెంట్ ని ఇంటర్ నెట్ నుండి కంప్లీట్ గా తొలగించాలని వాదించారు సీనియర్ న్యాయవాది వెంకటేశ్ ధోండ్.

also read:దసరా రేసులో బడా హీరోలు.. ఈసారి జేబులు ఖాళీ అవ్వడం పక్కా!

Advertisement

ఇక కేసుని పరిగణలోకి తీసుకున్న బాంబే హైకోర్టు పలు సెన్సేషన్ కామెంట్స్ చేసింది.ఇంటర్ నెట్ నుండి ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్ ని తొలగించడానికి ఒక ఒక ఆచరణాత్మక విధానాన్ని (ప్రాక్టికల్ ప్రోటోకాల్‌) తీసుకురావాలని టెక్ సంస్థలను ఆదేశించింది.అయితే దీనిపై గూగుల్, మెటా సంస్థల ప్రతినిధులు స్పందిస్తూ, బాధితురాలికి నష్టం చేకూర్చే వివాదాస్పద లింకులను డిలీట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.

అయితే అదే సమయంలో లో రెగ్యలర్ గా లీగల్ గా ఉండే కంటెంట్ కి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని, ముందస్తుగా కఠినమైన ఫిల్టర్లు పెడితే మిగతా వారు ఇబ్బంది పడే అవకాశము ఉందని తెలిపారు .దీంతో రెండు వైపు వాదనలు విన్న న్యాయమూర్తి కేవలం అభ్యంతరకర లింకులను మాత్రమే టార్గెట్ చేస్తూ వేగంగా తొలగించే సమర్థవంతమైన ప్రోటోకాల్ సిద్ధం చేయాలని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.

బాంబే హైకోర్ట్ ఎలాంటి ఊరటనిస్తుందో

ఇక ప్రీతి జింతా విషయానికి వస్తే ‘దిల్ సే’, ‘కల్ హో నా హో’, ‘వీర్ జారా’  వంటి ఎన్నో గొప్ప సినిమాలలో నటించి వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటిన సంగతి తెల్సిందే.ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహ-యజమానిగా స్టేడియంలో ప్రీతి ఎలాంటి హడావిడి చేసేదో చెప్పక్కర్లేదు.చూడాలి మరి డీప్ ఫేక్ తో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఏంతో మంది సెలెబ్రెటీలకి ఈ బాంబే హైకోర్ట్ ఎలాంటి ఊరటనిస్తుందో !

also read:జానపదాల జాతర నుంచి టాలీవుడ్ హీరోయిన్ గా.. ఎవరీ నాగదుర్గ?

Related News

జాన్ అబ్రహాం ఆకలికి హోటల్ ఓనర్ షాక్.. ఒక్క సిట్టింగ్‌లో అన్ని చపాతీలు తిన్నాడా?

హృతిక్ నుంచి రూ. 400 కోట్ల భరణం? అసలు నిజం బయటపెట్టిన ఫరా!

దసరా రేసులో బడా హీరోలు.. ఈసారి జేబులు ఖాళీ అవ్వడం పక్కా!

బిగ్ బాస్‌లోకి ఉప్పల్ బాలు? హౌస్ ఇక రచ్చ రచ్చే!

సుకుమార్-డీఎస్పీ 20 ఏళ్ల బంధానికి బ్రేక్? RC17 నుండి రాక్‌స్టార్ అవుట్..?

జన సైనికులా? గూండాలా? ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మండిపడ్డ ప్రకాష్ రాజ్!

నమ్మించి ముంచేసిన భర్త.. క్యాన్సర్‌తో అద్దె ఇంట్లోనే కన్నుమూసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

Big Stories

×