E-Paper

ఐపీఎల్ హీరో వైభ‌వ్ కు ఘోర అవ‌మానం…చీప్ గా రూ.15 వేల‌ క‌ల‌ర్ టీవీ గిఫ్ట్

ఐపీఎల్ హీరో వైభ‌వ్ కు ఘోర అవ‌మానం…చీప్ గా రూ.15 వేల‌ క‌ల‌ర్ టీవీ గిఫ్ట్
Advertisement

Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament) అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టుకు వైభవ్ ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండుతో జరిగే టి20 సిరీస్ సందర్భంగా కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ సంబంధించిన పాత వీడియో వైరల్ గా మారింది. వైభవ్ సూర్య వంశీకి ఓ కలర్ టీవీ బహుమానంగా ఇచ్చారు. లోకల్ లో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా వైభవ్ అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే అతడికి కలర్ టీవీ బహుమానంగా అందించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ హీరో వైభవ్ కు… చీప్ గా 15 వేల టీవీ ఇచ్చారా ? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

ఐపీఎల్ హీరో వైభ‌వ్ కు ఘోర అవ‌మానం…రూ.15 వేల‌ క‌ల‌ర్ టీవీ గిఫ్ట్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో అదరగొట్టిన వైభవ్ సూర్య వంశీ… చిన్నప్పటినుంచి క్రికెట్ లో అదరగొడుతున్నాడు. బీహార్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఈ కుర్రాడు… అక్కడి లోకల్ టోర్నమెంటులో దుమ్ము లేపాడు. ప్రతి టోర్నమెంటులో అర్థ సెంచరీ లేదా సెంచరీ చేస్తూ రెచ్చిపోయేవాడు. ఇక లేటెస్ట్ గా వైభవ్ తన 12 ఏళ్ల వయసులో ఆడిన ఓ ఇన్నింగ్స్ వైరల్ గా మారింది. బీహార్ రాష్ట్రంలో నిర్వహించిన ఓ టోర్నమెంట్ సందర్భంగా తన 12 ఏళ్ల వయసులో… అద్భుతంగా రానించి బీహార్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీకి ఒక టీవీని, బహుమతిగా అందించారు. నేరుగా కలర్ టీవీ తీసుకువచ్చి.. అతనికి ఇచ్చేశారు. దీని వ్యాల్యూ కేవలం 15 వేల రూపాయలు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2026లో రూ.50 ల‌క్ష‌లు గెలిచిన వైభ‌వ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ… ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో 776 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అలాగే ఒకే సీజన్ లో క్రిస్ గేల్ కంటే ఎక్కువగా సిక్సర్లు కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్య వంశీ దాదాపు 50 లక్షల భారీ నగదు పురస్కారాన్ని అందుకున్నారు. ఇందులో టాటా కారు కూడా ఉంది. దీని వాల్యూ 20 లక్షలకు పైగా ఉంటుంది.

Advertisement

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

 

Related News

స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న బాబ‌ర్‌, రిజ్వాన్‌

Sam Curran: స్కూల్ కు వెళ్లే బుడ్డోడిని తీసుకొచ్చి, బిల్డ‌ప్ ఇస్తున్నారు

బీసీసీఐని దెబ్బ‌కొట్టేందుకు పాక్ కుట్ర‌లు…సౌదీ అరేబియాతో క‌లిసి స్కెచ్‌

Tanveer Ahmed: మా వెధ‌వ‌ల‌ను ఇంగ్లీష్ కాస్లులతో పాటు మెంటల్ ఆస్ప‌త్రిలోనూ వేయండి

Michael Vaughan: టికెట్లు కొని సిద్ధంగా ఉన్నాం..ఇంకెన్ని రోజులు వైభవ్ ను దాస్తారు

వివాదంలో అభిషేక్ శ‌ర్మ‌..వైభ‌వ్ తో వెట్టిచాకిరీ, బ్యాట్లు మోయిస్తూ మ‌రీ !

వైభ‌వ్ 2-3 ఓవ‌ర్లు ఆడితే చాలు, ఇంగ్లండ్ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం..మాజీ క్రికెట‌ర్ వార్నింగ్

Big Stories

×