E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

జానపదాల జాతర నుంచి టాలీవుడ్ హీరోయిన్ గా.. ఎవరీ నాగదుర్గ?

జానపదాల జాతర నుంచి టాలీవుడ్ హీరోయిన్ గా.. ఎవరీ నాగదుర్గ?
Advertisement

Nagadurga Journey: నాగ దుర్గ …ఇప్పుడీ పేరొక సెన్సేషన్. ఫోక్ సాంగ్స్ కి కేరాఫ్ అన్నట్టుగా యూ ట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ కొల్లగొట్టిన జానపదాలన్నీఈమె ఖాతాలోనివే.ఇక యూట్యూబ్‌ వేదికగా కోట్లాది మందిని అలరించిన నాగ దుర్గ వనం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి ఇపుడు ప్రియదర్శి సరసన నటిస్తూ ‘ఇడుపు కాయితం’ అనే సినిమాతో మరో సారి  సిల్వర్ స్క్రీన్ పైకి  వస్తున్న సంగతి తెల్సిందే.మరి టాలీవుడ్ లో హీరోయిన్ గా సత్తా చాటుతానంటున్న ఫోక్ స్టార్ నాగ దుర్గ లైఫ్ స్టోరీ ఏంటో ఒకసారి చూసేద్దాం.

నాగదుర్గ పుట్టింది ఎక్కడంటే 

నాగదుర్గ సొంత గ్రామం ఉమ్మడి నల్గొండ జిల్లా అడ్డగూడూరు.చలపతిరావు, వాసవి దంపతులకి జన్మించిన నాగదుర్గ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసులోనే కాళ్ళకి గజ్జె కట్టడం విశేషం.అలా కూచిపూడి నాట్యం లోకి ప్రవేశించిన  నాగదుర్గ మంజు భార్గవి వంటి వారి వద్ద ఎన్నో వర్క్ షాప్స్ కి అటెండ్ అయి కూచిపూడిలో బాగా రాటు తేలింది.ఆతర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన నాగదుర్గ కేవలం క్లాసికల్ డ్యాన్సర్‌గానే ఆగిపోకుండా కాకతీయుల కాలం నాటి వీర నృత్యం, పేరిణి ‘ (పేరిణి లాస్యం) లోనూ శిక్షణ పొంది  ఒకటి కాదు రెండు కాదు దాదాపు 1600 వందలకి పైగా స్టేజ్ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా నల్గొండలో ‘నాగదుర్గ నృత్యాలయం’అనే డాన్స్ స్కూల్ ని స్థాపించి ఎందరికో ఉచితంగా నాట్యాన్ని నేర్పించింది కూడా.

ఏకంగా 13 కోట్లకు పైగా వ్యూస్‌

Advertisement

అలా సాగిపోతున్న నాగ దుర్గ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది  2021 లో వచ్చిన కోవిడ్ లాక్ డౌన్.ఆ సమయంలో ఎదో పొద్దుపోక యూట్యూబ్‌ లో సరదాగా వీడియోలు చేయడం మొదలెట్టింది నాగ దుర్గ.ఆ సమయంలో చరణ్ అనే ఫోక్ సాంగ్స్ డైరెక్టర్ తో చేసిన ‘తిన్నాతీరం పడతలే, కూసున్నా తీరం పడతలే’ అనే ఫోక్ సాంగ్ చేయడంతో  ఒక్కసారిగా నాగ దుర్గ లైఫ్ మారిపోయింది.ఎక్కడ చూసినా ,ఎక్కడ విన్నా ఈ పాటే.అలా ఈపాట ఏకంగా 13 కోట్లకు పైగా వ్యూస్‌ కొల్లగొట్టి అందరి చూపుని తన వైపుకి తిప్పుకుంది.

also read:యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. వెండితెరపై హీరోయిన్ ఛాన్స్.. అయినా దానికి నో చెప్పిన నాగదుర్గ!

Advertisement

ఇక తర్వాత చేసిన ఎన్నో పాటలు మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టి నాగ దుర్గ ని క్వీన్ ఆఫ్ ఫోక్ సాంగ్ గా నిలబెట్టాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన  పాట .. ‘ఎర్రాఎర్రా రూమాలు కట్టి యాడ పోతున్నావు బావా’ సాంగ్.చిన్న పిల్లల నుండి పెద్దవారి దాకా,అన్ని జెనరేషన్స్ వారిని ఒక ఊపు ఊపింది.అలా ఇప్పటి వరకు ఈ పాట ఏకంగా 40 కోట్లకు పైగా వ్యూస్‌తో ఇప్పటి వరకు వచ్చిన ఫోక్ సాంగ్స్ లో ఒక చరిత్ర ని స్ప్రుష్టించింది.

దాదాపు  300కు పైగా ఫోక్ సాంగ్స్

ఇక ఇవన్ని ఒకెత్తయితే ఈ మధ్య తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో వచ్చిన  ‘పేరుగల్ల పెద్దిరెడ్డీ బిడ్డనో ఓ రామ చిలకా’ సాంగ్ 16 కోట్లు , ‘దారిపొంటొస్తున్నాడు దవ్వదవ్వొస్తున్నాడు’ సాంగ్ 1౩ కోట్లు  మరియు ‘మామిడి కోనాలమీద మబ్బులేమొ నిలిచినాయి’ పాట 3 కోట్లకు పైగా  వ్యూస్ కొల్లగొట్టి ఫోక్ సాంగ్స్ అంటే కేరాఫ్ నాగ దుర్గ, నాగ దుర్గ అంటే కేరాఫ్ ఫోక్ సాంగ్స్  అన్నట్టుగా మారిపాయింది.ఇక వీటితో పాటు ‘నాపేరు ఎల్లమ్మ’, ‘కాపోళ ఇంటికాడ’, ‘జిల్లెలమ్మ జిట్ట’,వంటి పాటలకి తెలుగు ప్రజల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.అలా ఒకటి రెండు కాదు ఏకంగా దాదాపు  300కు పైగా ఫోక్ సాంగ్స్ లో నటించి మెప్పించి కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకుంది నాగ దుర్గ.

నాట్యంలో డాక్టరేట్ (phd) చేయాలన్న కోరిక

ఇక యూట్యూబ్ లో నాగ దుర్గకి ఉన్న క్రేజ్ చూసి గతంలోనే ఆమె దగ్గరికి టాలీవుడ్ మేకర్స్ క్యూ కట్టారు. నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్’ (2021) లో ఒక క్లాసికల్ డాన్సర్ కోసం,అలాగే విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ (2022) లో హీరోయిన్ పాత్ర కోసం అడిగినప్పటికీ సున్నితంగా రిజెక్ట్ చేసిందంట .కారణం నాట్యంలో డాక్టరేట్ (phd) చేయాలన్న కోరిక బలంగా ఉండటమే.ఇక ఆతర్వాత బిగ్ బాస్ లోకీ ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చినప్పటికీ ఆ షో తనకి సెట్ కాదని  వెళ్లలేదని గతం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తొలిసారి వెండి తెరపై కనబడింది

ఇవన్నీ ఇలా ఉంటె నాగ దుర్గ తొలిసారి వెండి తెరపై కనబడింది వనం అనే సినిమాతో.గతేడాది న‌వంబ‌ర్‌21న థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఫ‌ర్వాలేద‌నిపించుకున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది నాగ దుర్గ.రాజ్‌ నరేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి  నిర్మించారు.దీని తర్వాత కోలీవుడ్ లో లవ్ హో లవ్’  అనే సినిమాలో నటించింది నాగాదుర్గ.పవీష్ హీరోగా కనిపించనున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్దమవుతుంది.

ఎలాంటి రికార్డులని కొల్లగొడుతుందో

ఇవన్నీ ఒకెత్తయితే ప్రస్తుతంసుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రంలో  హీరోయిన్‌గా కనిపించడం మరో ఎత్తని చెప్పాలి.ప్రియదర్శి హీరోగా  వంశీకృష్ణ దొండపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పేరు ఇడుపు కాయితం .ఇక ఇదే పేరుపై గత కొన్ని రోజులుగా రెండు రాష్టాల్లో రచ్చ జరుగుతుంది కూడా.మొత్తానికి తనదైన స్టెప్పులతో యూట్యూబ్ ని షేక్ చేసిన నాగ దుర్గ ఇపుడు సిల్వర్ స్క్రీన్ ని షేక్ చెయ్యడానికి రెడీ అయిపోయిందన్న మాట.చూడాలి మరి ఈ క్వీన్ ఆఫ్ ఫోక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులని కొల్లగొడుతుందో !

Related News

నమ్మించి ముంచేసిన భర్త.. క్యాన్సర్‌తో అద్దె ఇంట్లోనే కన్నుమూసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

చిరంజీవి బర్త్డే స్పెషల్.. మెగా 158 పై తమన్ అదిరిపోయే అప్డేట్!

విరాజ్ అశ్విన్ ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ పై అంచనాలు పెంచేసిన బన్నీ.. స్పెషల్ పోస్ట్ వైరల్!

72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్.. రంగంలోకి సౌత్ స్టార్ హీరోలు!

మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన అమీర్ ఖాన్!

ఎందుకీ సిగ్గులేని కక్ష సాధింపులు.. జనాలు చూస్తున్నారు.. ప్రశ్న రావణ్ అరెస్ట్ పై మళ్లీ స్పందించిన ప్రకాష్ రాజ్!

Akhil Akkineni: నాకు అప్పుడే తెలుసు.. సమంత పై అఖిల్ ఊహించని కామెంట్స్!

Big Stories

×