E-Paper
Advertisement

Thaman : ఒత్తిడిలో ఉన్న తమన్ రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ పై కసరత్తు

Thaman : ఒత్తిడిలో ఉన్న తమన్ రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ పై కసరత్తు
Advertisement

Thaman : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ సంగీత దర్శకులలో తమన్ ఒకరు. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత తమన్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించటం మాత్రమే కాకుండా త్రివిక్రమ్ తో మంచి పరిచయానికి తమన్ కు హెల్ప్ అయింది.

త్రివిక్రమ్ కి తమన్ కి మధ్య ఆ పరిచయం ఉండడం బట్టే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చేసిన ప్రతి సినిమాకి సంగీత దర్శకుడుగా తమన్ కు అవకాశం వచ్చింది. అయితే తమన్ ఎన్ని సినిమాలు చేసినా కూడా మొన్న ఓజితో విపరీతమైన పేరు లభించింది. ప్రస్తుతం తమన్ చేతిలో చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాకి సంగీతం కూడా తమన్ చేస్తున్నాడు.

తమన్ పై ఒత్తిడి 

Advertisement

ఈరోజుల్లో ఒక సూపర్ హిట్ సాంగ్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆ సాంగ్ కంపోజ్ చేసిన తర్వాత అది కొన్ని రోజులు సోషల్ మీడియాలో ట్రెండ్ అయితేనే సినిమా మీద మంచి బజ్ వస్తుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాజా సాబ్ సినిమా నుంచి మొదటి సింగిల్ విడుదల చేస్తారు అని అందరూ ఊహించారు.

కానీ ఆ సినిమా నుంచి మొదటి సింగిల్ రాలేదు. ఇక నవంబర్ ఐదు న ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ వస్తుంది అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తమన్ మీద ఆ పాట గురించి విపరీతమైన ఒత్తిడి ఉంది.

Advertisement

చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా నుండి మీసాల పిల్ల పాట విడుదలై మంచి పాపులర్ అయిపోయింది. ఇప్పటికీ కూడా ఎక్కడ చూసినా కూడా ఆ పాట విపరీతంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఆ పాటను మించి ఈ పాట ఉంటేనే సోషల్ మీడియాలో డామినేషన్ కనిపిస్తుంది.

పాట హిట్ అయితే సినిమాకి ప్లస్ 

అనిల్ రావిపూడి గురించి ప్రత్యకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసినప్పుడు గోదారి గట్టు పైన రామచిలకవే అనే పాట బాగా పాపులర్ అయిపోయింది. ఆ పాట వలనే సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు మీసాల పిల్ల పాట మీద కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

అయితే సంక్రాంతికి రిలీజ్ అయ్యే రాజా సాబ్ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఇంకా పెరగాలి అంటే మ్యూజిక్ ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అయితే తమన్ దాని గురించి ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారో వేచి చూడాలి.

Also Read: Naga Vamsi : ఈసారి ఏం జరిగినా కూడా దుబాయ్ అయితే వెళ్ళను, నాగ వంశీ కౌంటర్ వాళ్లకేనా?

Related News

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

Big Stories

Advertisement
×