Mass Jathara Event : మామూలుగా నిర్మాతలు బయట పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ నిర్మాత నాగ వంశీ మాత్రం ఒక బ్రాండ్ అని చెప్పాలి. తన సినిమాని ప్రమోషన్ చేయడంలో నాగవంశీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటారు. ముఖ్యంగా కొన్నిసార్లు నాగ వంశీ మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతాయి. మీడియా ఎదుర్పడినప్పుడు నాగవంశీ వేసే కొన్ని సెటైర్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నాడు నాగ వంశీ. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది. అయితే ఆ సినిమా ఈవెంట్ లో నాగ వంశీ మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ గా మారిపోయాయి. ఈ సినిమా కానీ హిట్ అవ్వకపోతే ఇంకెప్పుడూ మైకు పట్టుకొని సినిమా చూడండి అని అడగను అంటూ శపథం కూడా చేశాడు.
ఇక ప్రస్తుతం నాగ వంశీ మాస్ జాతర సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో నాగవంశీ మాట్లాడడానికి ముందు చాలా మంది క్రౌడ్ విపరీతంగా అరిచారు. అలా అరవకండి మీరు అలా అరవడం వల్లనే ఎక్సైట్మెంట్లో ఒకసారి తప్పిదం జరిగిపోయింది.
మనకు ఈ స్పీచ్ లు అవి పెద్దగా అచ్చిరావు. అంటూ చాలా నార్మల్ గా సినిమా గురించి చెప్పాడు నాగ వంశీ. ఈ సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉంది అంటూ తెలిపాడు. స్పీచ్ ముగించే చివర్లో కచ్చితంగా దుబాయ్ అయితే వెళ్లిపోను అంటూ మాట్లాడాడు నాగ వంశీ.
వార్ 2 సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. కాబట్టి ఆ సినిమా వలన నాగ వంశీ విపరీతంగా డబ్బులు నష్టపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. డబ్బులు నష్టపోయిన మాట వాస్తవమే, కానీ ఆ ప్రొడక్షన్ హౌస్ కి సక్సెస్ రేట్ కూడా ఉంది కాబట్టి నిలబడగలిగాడు నాగ వంశీ.
అయితే ఆ సినిమా ఫెయిల్ అయిన వెంటనే ఆస్తులు అన్ని అమ్ముకొని దుబాయ్ వెళ్లిపోయినట్లు అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై నాగ వంశీ కూడా గతంలో స్పందిస్తూ, అన్నీ నష్టపోతే ఆస్తుల అమ్ముకొని దుబాయ్ ఎందుకు వెళ్తాను అనే లాజిక్ నాకు అర్థం కాలేదు అని ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూస్ లోనే క్లారిటీ ఇచ్చాడు. మరోసారి స్పీచ్ లో దుబాయ్ వెళ్ళను అని చెప్పాడు నాగ వంశీ.
Also Read: Mass Jathara Event : మీకు చిరాకు తెప్పించాను నన్ను క్షమించండి, నా ప్రామిస్ ను నమ్మండి