Varanasi : మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది మల్టీ టాలెంటెడ్ నటులలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. ఈరోజుల్లో భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలను చూడటం అనేది చాలామంది తెలుగు ప్రేక్షకులు అలవాటు చేసుకున్నారు. ఇంకా ఓపెన్ గా మాట్లాడితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల కంటే కూడా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోని రిలీజ్ అయిన ఎక్కువ సినిమాలు ఓటీటీలో అయినా చూసి వాటిని సోషల్ మీడియాలో పొగుడుతూ పోస్టులు పెడుతుంటారు.
ఇదే విషయాన్ని ఒక రోజు ఓపెన్ గా స్టేజ్ పైన హరీష్ శంకర్ మాట్లాడుతూ మనకు అలవాటే కదా పరభాష సినిమాలను ఎంకరేజ్ చేసి చూడటం అనేది ఈ సినిమాను కూడా అలానే సక్సెస్ చేయండి అంటూ వేరే సినిమా ఈవెంట్లో చెప్పాడు. ఇకపోతే అలా సినిమాలు చూస్తున్న తరుణంలో పృథ్విరాజ్ చాలామందికి దగ్గరే పోయాడు. పవన్ కళ్యాణ్ రానా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఒరిజినల్ సినిమాలో పృథ్వీరాజ్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. భీమ్లా నాయక్ సినిమా అనౌన్స్ చేసినప్పుడే అయ్యప్పను కోషియం సినిమాను చాలామంది చూసి పృధ్విరాజ్ కు ఫిదా అయిపోయారు.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ కు సరైన హిట్ సినిమా పడలేదు అని ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్న తరుణంలో ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా కమర్షియల్ సక్సెస్ అందించింది. ఆ సినిమాలో ప్రశాంత్ ప్రభాస్ ని చూపించిన విధానానికి చాలామంది ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో ఆల్రెడీ పృధ్విరాజ్ ఒక కీలక పాత్ర చేశారు.
ఈ తరుణంలోని ప్రశాంత్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో కూడా పృధ్విరాజ్ కు ఒక అవకాశం వచ్చింది. ఒక కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చినా కూడా ఆ ఆఫర్ ను పృథ్వీరాజ్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. మరోవైపు వారణాసి సినిమాతో పృథ్వీరాజ్ బిజీగా మారిపోయిన సంగతి తెలిసిందే. అతని ఫోకస్ అంతా కూడా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి పైనే ఉంది. అందుకనే డ్రాగన్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ కెరియర్ కి బాహుబలి సినిమా ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చింది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని కూడా ఆ సినిమా పెంచింది. బాహుబలి సినిమా తర్వాత బాహుబలి 2 సినిమా చేయటానికి కొంత గ్యాప్ దొరుకుతుంది ఈ మధ్యలో నువ్వు మరో సినిమా చేసుకో అని రాజమౌళి చెప్పిన కూడా ప్రభాస్ కేవలం బాహుబలి కోసం మాత్రమే ఎదురు చూసాడు. అలా ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా ప్రభాస్ బాటలోనే మిగతా సినిమా ఆఫర్లు వస్తున్న కూడా రాజమౌళి సినిమా చేస్తున్నాడు కాబట్టి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ వారణాసి పైన పెట్టాడు.
Also Read: Ibomma Ravi: తీగ లాగితే డొంక కదిలింది, ఐ బొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే నిజాలు