E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : హౌస్ లో కొట్టుకున్న డిమాన్ పవన్ అండ్ కళ్యాణ్, ఆమె కోసమా గేమ్ కోసమా?

Bigg Boss 9 Telugu : హౌస్ లో కొట్టుకున్న డిమాన్ పవన్ అండ్ కళ్యాణ్, ఆమె కోసమా గేమ్ కోసమా?
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఆసక్తికరంగా మొదలైంది. కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా కొంతమంది కామనర్స్ ను కూడా హౌస్ లోకి పంపించారు. అయితే వీళ్ళని పంపించినప్పుడు కామనస్సు ఒక బ్యాచ్, సెలబ్రిటీస్ ఒక బ్యాచ్ గా మొదట గేమ్ ఆడటం మొదలుపెట్టారు. మొదట్లో కామనర్స్ అంతా మనం కలిసే ఉండాలి అనుకునేటట్లు మాట్లాడుకునేవాళ్ళు. గేమ్ కూడా అలానే ఆడుదాం అని అనుకునేవాళ్ళు.

కానీ రోజులు మారుతున్న కొద్దీ హౌస్మెట్స్ లో చాలా మార్పు వచ్చేసింది ఒకరి మీద ఒకరికి బాండింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. సెలబ్రిటీలు కామనర్లు అని కాకుండా మొత్తం హౌస్ మేట్స్ అనే ఫీలింగ్ లోకి వచ్చేసారు. కామనర్స్ లో భాగంగా వచ్చిన పవన్ మరియు కళ్యాణ్ పడాల మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉండేది. ఏదైనా కూడా అరె ఒరే అనే మాట్లాడుకుని స్థాయిలో వీరి మధ్య ఫ్రెండ్షిప్ నడిచింది.

రీతు చిచ్చు పెట్టిందా?

Advertisement

కామనర్స్‌గా వచ్చిన వీరిద్దరు మంచి ఫ్రెండ్స్‌గా ఉండే వాళ్లు స్టార్టింగ్ డేస్‌లో, రీతుతో పరిచయం పెరుగుతున్నా కొద్ది, వీరి ఫ్రెండ్‌షిప్ తగ్గుతూ వచ్చింది. చివరికి మెడ పట్టి తోసుకునేంత వరకు వచ్చారు.

ఈ వారం హౌస్ లో ఇదే చర్చ్ అనే అంశం అయింది. వచ్చే శనివారం దీనిపై నాగార్జున చాలా సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది. పవన్‌కు రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది అని తెలుస్తుంది.

Advertisement

కళ్యాణ్ కొన్ని బూతులు మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాగే ఆ గొడవ టైంలో, హౌస్ లోఉన్న కూర్చిలను తన్నడం లాంటివి చేశాడు. దీంతో కళ్యాణ్ కు కూడా సీరియస్ వార్నింగ్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇంత ఫ్రెండ్స్ మధ్యలో కేవలం రీతు వలనే గొడవ జరిగింది అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదన. రీసెంట్ టైమ్స్ లో రీతూ చౌదరి మరియు పవన్ ఎంతలా కలిసి తిరిగారు సీజన్ చూస్తున్న అందరికీ కూడా అర్థమవుతుంది. వారిద్దరి మధ్య ఒక పేరు లేని బాండింగ్ అనేది క్రియేట్ అయింది. అయితే ఆ బాండింగ్ ఇప్పుడు ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ పడేలా చేసింది అని కొందరు అంటున్నారు.

గేమ్ కోసమా ఆమె కోసమా? 

అయితే నిన్న జరిగింది మాత్రం ఊహించని ఒక పరిణామం. ఆ స్థాయిలో గొడవపడాల్సిన అవసరం అసలే లేదు. అయితే ఇదంతా గేమ్ కోసం చేశారా లేకపోతే ఆమె కోసం చేశారా అని ఆలోచనలు చాలామందికి మొదలైపోయాయి. దీనితో సర్వత్ర శనివారం జరగబోయే ఎపిసోడ్ మీద ఆసక్తి నెలకొంది. నాగార్జున ఎవరిని తప్పు అని చెబుతారు, ఆ విషయంపై ఏమి రియాక్ట్ అవుతారు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది.

ఈ విషయాన్ని నాగార్జున డీల్ చేసే విధానం పైనే నాగర్జున కు కూడా ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ విషయాన్ని సరిగ్గా చెప్పలేక మేనేజ్ చేయాలని చూస్తే అదే స్థాయిలో కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించడం కామన్ గా జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది అనేది వీకెండ్ లో క్లారిటీ వస్తుంది.

Also Read: Raju Weds Rambai : దర్శకుడు కి నక్సలైట్ బ్యాక్ డ్రాప్, ఈ విలక్షణమైన కథకు కారణం అదేనా?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×